అయోధ్యకు చేరిన 613 కిలోల గంట.. మోగిస్తే ఐదు కిలోమీటర్ల దూరం వినిపించే 'ఓం' శబ్దం

అయోధ్యకు చేరిన 613 కిలోల గంట.. మోగిస్తే ఐదు కిలోమీటర్ల దూరం వినిపించే ఓం శబ్దం
x
Highlights

అయోధ్యలోని రాముడి ఆలయంలో మోగించడానికి 613 కిలోల బరువున్న ఇత్తడి గంట వచ్చి చేరింది. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో ఈ గంటను ప్రత్యేకంగా తయారుచేయించారు..

అయోధ్యలోని రాముడి ఆలయంలో మోగించడానికి 613 కిలోల బరువున్న ఇత్తడి గంట వచ్చి చేరింది. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో ఈ గంటను ప్రత్యేకంగా తయారుచేయించారు. రాముని పరమ భక్తురాలు, లీగల్ రైట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి మండా రాజ్యలక్ష్మి ఈ గంటను తయారు చేయించారు. రామేశ్వరం నుంచి రామరథయాత్ర పేరిట ప్రత్యేక వాహనంలో అయోధ్యకు తరలించారు. సెప్టెంబరు 17న అక్కడినుంచి బయలుదేరిన ప్రత్యేక వాహనం 21 రోజుల పాటు 11 రాష్ట్రాలమీదుగా 4,555 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బుధవారం అయోధ్యకు చేరింది. మొత్తం 18 మంది భక్తులు ఈ రామరథయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అయోధ్యకు చెందిన ఎంపి, ఎమ్మెల్యే, అయోధ్య మేయర్, రామ్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సహా పలువురు ప్రముఖులు రామరథయాత్ర ముగింపులో పాల్గొన్నారు. కాగా యాత్రకు ముందు రామేశ్వరంలోని రామమందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ గంటను ఒకసారి కొడితే ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి కూడా వినిపిస్తోందని భావిస్తున్నారు. అందులో కూడా 'ఓం' అని శబ్దం వస్తుంది. ఇక ఈ గంట మీద రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడితోపాటు వినాయకుడి ప్రతిమల తోపాటు జై శ్రీరాం అనే అక్షరాలు రాసి ఉంది. ఇదిలావుంటే రామేశ్వరం ప్రాంతానికి పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. సీత్వానేషణలో భాగంగా రామేశ్వరం నుంచి లంకకు వానరసేనతో కలిసి శ్రీరాముడు సముద్రంలో వారధిని నిర్మించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories