A Boy commits to suicide in Quarantine: క్వారంటైన్ లో ఉండలేక బాలుడు ఆత్మహత్య

A Boy commits to suicide in Quarantine: క్వారంటైన్ లో ఉండలేక బాలుడు ఆత్మహత్య
x
Boy in quarantine commits suicide in Karnataka
Highlights

A Boy commits to suicide in Quarantine: క్వారంటైన్ లో ఉండలేక ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్ణాటకలోని చోటుచేసుకుంది.

A Boy commits to suicide in Quarantine: క్వారంటైన్ లో ఉండలేక ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్ణాటకలోని చోటుచేసుకుంది. ఉడిపి జిల్లా సాలిగ్రామాకు చెందిన ఓ కుటుంబం కూలి పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. కుటుంబంలోని ఓ మహిళ ఇంట్లో పనిమనిషిగా చేస్తోంది. అయితే ఆ కుటుంబంలో ఇటీవల ఒకరికి కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో మహిళ ఆమె 15 ఏళ్ల బాలుడినిహోమ్ క్వారంటైన్ లో ఉండమన్నారు పోలీసులు. అయితే ఆ బాలుడు క్వారంటైన్ లో ఉండటానికి ఇష్టపడలేదు. ఎప్పుడూ బయట తిరుగుతూ ఉండటం మూలాన అతను ఇంట్లో ఉండలేకపోయాడు ఈ క్రమంలో అప్పుడప్పుడు బయటికి రావడం చేస్తున్నాడు.

అయితే చుట్టుపక్కలవారు అభ్యంతరం తెలపడంతో అతను మనస్థాపం చెందినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్య్మలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వర్గాలు బుధవారం తెలిపాయి. అతను కోటా అనే పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్నాడు. 15 ఏళ్ల బాలుడు మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇదిలావుంటే కర్ణాటక లో జూలై 7 సాయంత్రం నాటికి మొత్తం 26,815 కోవిడ్ -19 కేసులు నిర్ధారించబడ్డాయి, ఇందులో 416 మరణాలు, 11,098 డిశ్చార్జెస్ ఉన్నాయి.15,297 క్రియాశీల కేసులలో, 15,018 మంది రోగులు నియమించబడిన ఆసుపత్రులలో ఐసోలేషన్ ఉన్నారు.. 279 మంది ఐసియులో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories