దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి బుస్టర్ డోస్

Booster Dose for People over 18 Across the Country | Telugu News
x

దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి బుస్టర్ డోస్

Highlights

Booster Dose: ఈనెల 10నుంచి ప్రైవేటు కేంద్రాల్లో బుస్టర్ డోస్ పంపిణీ

Booster Dose: దేశ‌వ్యాప్తంగా 18 ఏళ్ల వ‌య‌సు నిండిన‌వారంద‌రికీ ఇక నుంచి బూస్టర్ డోసును ఇవ్వనున్నారు. ప్రైవేటు వ్యాక్సినేష‌న్ సెంట‌ర్లలో ఆ టీకాలు అందుబాటులో ఉంటాయి. ఈనెల 10వ తేదీ నుంచి బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. క‌రోనా వైర‌స్ నివార‌ణలో భాగంగా కోవిడ్ టీకాల‌ను ఇస్తున్నారు. అయితే బూస్టర్ డోసు తీసుకోవాల‌నుకునే 18 ఏళ్లు దాటిన‌వాళ్లు అమౌంట్ చెల్సించాల్సి ఉంటుంది.

వాస్తవానికి ఆరోగ్య కార్యక‌ర్తలు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది, 60 ఏళ్లు దాటిన వాళ్లకు తొలుత బూస్టర్ డోసు ఇచ్చారు. కానీ 60 ఏళ్లలోపు వారికి మాత్రం బూస్టర్ డోసును ఉచితంగా ఇవ్వడం లేదు. ప్రభుత్వ వ్యాక్సినేష‌న్ కేంద్రాల ద్వారా ఫ‌స్ట్‌, సెకండ్ డోసుల‌ను ఉచితంగా ఇచ్చారు. హెల్త్‌కేర్ వ‌ర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారికి కూడా ప్రికాష‌న్ డోసును ఉచితంగా ఇచ్చారు. ఇప్పటి వ‌ర‌కు 15 ఏళ్లు దాటిన వారిలో 96 శాతం కోవిడ్ టీకా తీసుకున్నారు. సెకండ్ డోసు, బూస్టర్ డోసు మ‌ధ్య 90 రోజుల వ్యవ‌ధి ఉండాలి.

ఆరోగ్య కార్యక‌ర్తల‌కు, ఫ్రంట్ లైన్ వారియ‌ర్లకు మొద‌టిసారిగా 2021, జ‌న‌వ‌రి 16న టీకా పంపిణీ ప్రారంభించ‌గా, మార్చి 1 నుంచి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధుల వారికి వ్యాక్సినేష‌న్ అందించారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్లు పైబ‌డిన అంద‌రికీ టీకా వేశారు. మే 1 నుంచి 18 ఏండ్లు నిండిన వారంద‌రికీ వ్యాక్సిన్లు అందించ‌డం ప్రారంభించారు. 2022, జ‌న‌వ‌రి 3 నుంచి 15 -18 ఏండ్ల వ‌య‌సున్న పిల్లల‌కు టీకాలు ఇచ్చారు. జ‌న‌వ‌రి 10వ తేదీ నుంచి వృద్ధుల‌కు, ఫ్రంట్ లైన్ వారియ‌ర్లకు బూస్టర్ డోస్ అందించారు. మార్చి 16న నేష‌న‌ల్ వ్యాక్సినేష‌న్ డే సంద‌ర్భంగా 12 నుంచి 14 ఏండ్ల లోపు పిల్లల‌కు వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌ను ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories