Top
logo

Varavara Rao: ఏడాది తర్వాత వరవరరావుకు బెయిల్ మంజూరు

Varavara Rao bail
X

వరవరావు ఫైల్ ఫోటో(TheHansindia)

Highlights

Varavara Rao: గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావు

Varavar Rao: విరసం నేత వరవరరావుకు బెయిల్‌ మంజూరైంది. ఏడాది తర్వాత వరవరరావుకు బెయిల్ ఇచ్చింది కోర్టు. గతేడాది మహారాష్ట్రలోని బీమా కోరెగావ్ కుట్ర కేసులో వరవరరావును ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ను ముంబైకోర్టు మంజూరు చేసింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో షరతులతో కూడిన బెయిల్‌ను ముంబై కోర్టు మంజూరు చేసింది.

బెయిల్ మంజూరు చేసే సమయంలో ముంబై హైకోర్టు షరతులు విడిచింది. ఆరు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని హైకోర్టు సూచించింది. అంతేకాదు.. ముంబై విడిచి ఎక్కడకు వెళ్లొద్దని హైకోర్టు తెలిపింది. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు..

Web TitleVarvara Rao: Bombay High Court grants bail
Next Story