Delhi Public School: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు

Bomb Threat To Delhi Public School
x

Delhi Public School: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు

Highlights

Delhi Public School: మథుర రోడ్‌లోని స్కూల్‌కు మెయిల్ ద్వారా బెదిరింపు

Delhi Public School: దేశ రాజధానిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. పాఠశాల ఆవరణలో బాంబులున్నాయంటూ మథురా రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు ఈ- మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం.. విద్యార్థులను, సిబ్బందిని అక్కడి నుంచి బయటకు పంపించింది. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ..అనుమానాస్పద వస్తువులు గానీ లభ్యంకాలేదు. ప్రస్తుతం ఈ-మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

సరిగ్గా రెండు వారాల క్రితం కూడా ఇదే తరహాలో ఢిల్లీ స్కూల్‌కు ఈ-మెయిల్ వచ్చింది. సాదిఖ్ నగర్‌లోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంగణంలో బాంబులు ఉన్నాయని అందులో పేర్కొనడంతో ఆందోళనకు గురైన యాజమాన్యం.. విద్యార్థులు, టీచర్లను బయటకు పంపించింది. అప్పుడు కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories