Jammu And Kashmir: అమిత్ షా పర్యటనకు ముందు.. జమ్ముకశ్మీర్‌లో వరుస పేలుళ్లు

Bomb Blast in Udhampur Jammu and Kashmir
x

Jammu And Kashmir: అమిత్ షా పర్యటనకు ముందు.. జమ్ముకశ్మీర్‌లో వరుస పేలుళ్లు

Highlights

Jammu And Kashmir: గంటల వ్యవధిలోనే రెండు చోట్ల బాంబు పేలుళ్లతో స్థానికులు ఉలిక్కిపడ్డారు..

Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్‌ ఉదంపూర్‌లో బాంబు పేలుళ్లు కలకలం రేపాయి.. పార్క్‌ చేసి ఉన్న రెండు బస్సుల్లో బాంబులు పేలాయి. గంటల వ్యవధిలోనే రెండు చోట్ల బాంబు పేలుళ్లతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.. ఉదంపూర్‌లోని దొమాయిల్‌ చౌక్‌ పెట్రోల్‌ పంపు సమీపంలో రాత్రి 10.30గంటలకు మొదటి బాంబు పేలింది. ఈ పేలుడులో కండక్టర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. ఇది జరిగిన కొన్ని గంటలకే ఉధంపూర్‌లో మరో బస్సులో పేలుడు సంభవించడం ఆందోళన కలిగించింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఉధంపూర్‌ బస్టాండ్‌లో నిలిపిన ఓ బస్సు పేలిపోయింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మరో మూడు రోజుల్లో జమ్మూకాశ్మీర్‌ పర్యటించనుండగా ఈ ఘటనలు చోటు చేసుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. బాంబులు ఎవరు అమర్చారు.. ఘటనకు ఎవరు బాధ్యులు అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాంబు స్క్వాడ్‌ బలగాలు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories