పెళ్లివేడుకలో పేలుడు ... 40 మంది మృతి, పలువురికి గాయాలు

పెళ్లివేడుకలో పేలుడు ... 40 మంది మృతి, పలువురికి గాయాలు
x
Highlights

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుడుతో ఉలిక్కిపడింది. పెళ్లి వేడుకలో దుండగులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో 40మంది మృతి...

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుడుతో ఉలిక్కిపడింది. పెళ్లి వేడుకలో దుండగులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో 40మంది మృతి చెందగా.. వంద మందికి పైగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వేడుకకు దాదాపు వెయ్యిమంది హాజరు అయినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇంకా ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు. పేలుడు తీవ్రత భారీ స్థాయిలో ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వివాహ వేడుకకు హాజరైన అతిథులు గుంపులుగా ఉన్న సమయంలో దుండగుడు ఆత్మాహుతికి పాల్పడినట్లు తెలుస్తోందని అఫ్గానిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నుష్రత్‌ రహీమీ తెలిపారు. పెళ్లి వేదికపై సంగీత బృందం ప్రదర్శన ఇస్తున్న సమయంలో అతిథులంతా అక్కడ గుమిగూడారని, ఆ సమయంలో దుండగుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. మృతుల సంఖ్యపై అక్కడి ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటి వరకు దాడికి ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించనప్పటికీ.. స్థానిక ఇస్లాం ఉగ్రముఠాలతో కలిసి తాలిబన్లే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories