Top
logo

బాలీవుడ్‌లో విషాదం...ఇంట్లో ఉరివేసుకుని సందీప్ నహర్ సూసైడ్

Bollywood Young Actor Sandeep Nahar Suicide
X

 ఆక్టర్ సందీప్  నహర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

* తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ * భార్యతో పడలేకపోతున్నానంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్

సినీ ఇండస్ట్రీలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నారు. ఒక ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంటోంది. బంగారు భవిష్యత్‌ ఉన్న యువ నటులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నాటి నుంచి బాలీవుడ్‌లో నిత్యం ఏదో ఒక సంఘటన వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.. దీంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎంఎస్ ధోని సినిమాలో కో స్టార్‌గా నటించిన సందీప్ నహర్ సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబై గోరేగావ్ ప్రాంతంలోని తన నివాసంలో సందీప్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకన్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సందీప్‌ నహర్ ఎంస్ ధోని సినిమాతో పాటు.. అక్షయ్ కుమార్ తో కలిసి అన్‌టోల్డ్ స్టోరీ, కేసరి వంటి మూవీల్లో నటించాడు.


Web TitleBollywood Young Actor Sandeep Nahar
Next Story