logo

కాంగ్రెస్ కి బాలీవుడ్ నటి బై బై ...

కాంగ్రెస్ కి బాలీవుడ్ నటి బై బై ...
Highlights

కాంగ్రెస్ పార్టీకి బాలీవుడ్ నటి ఊర్మిళ టాటా చెప్పేసారు. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి . ఈ నేపధ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది .

కాంగ్రెస్ పార్టీకి బాలీవుడ్ నటి ఊర్మిళ టాటా చెప్పేసారు. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి . ఈ నేపధ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది . ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు అందరు సినీ స్టార్స్ బీజేపీకి సపోర్ట్ చేస్తుంటే ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు . అ ఎన్నికల్లో ఆమె ఉత్తర ముంబై పార్లమెంటు నుంచి పోటీచేసి బీజేపీ సీనియర్ నేత గోపాల్ చినయ్య శెట్టి చేతిలో నాలుగున్నర లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓటమిని ఆమె అంగీకరిస్తూ తన మొదటి అడుగులో మాత్రమే ఓడిపోయానని కానీ రాజకీయాల్లో కొనసాగుతానని ఆమె స్పష్టం చేసారు . ఇలా ఆరు నెలలు కొనసాగాకా పార్టీ నుండి బయటకు వచ్చారు . పార్టీని వీడకా ఆమె స్పందిస్తూ తన ఓటమికి పార్టీలో కొన్ని వర్గాలు పనిచేశాయని చెబుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఊర్మిళ.


లైవ్ టీవి


Share it
Top