Top
logo

ఇది కల నెరవేరిన క్షణం : అద్వానీ

LK Advani
X
LK Advani
Highlights

ఇది కల నెరవేరిన క్షణం, రామజన్మభూమికి దేశ వారసత్వ సంపదల్లో ఎంతో గౌరవం ఉందన్నారు.

భారతదేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన అయోధ్య వివాదాస్పద భూమి రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీకోర్టు శనివారం కీలక తీర్పు వెల్లడించింది. 40 రోజుల పాటు వరుసగా విచారణ చేసిన రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని సర్వోన్నత న్యాయస్థానం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఆలయ నిర్మాణం కోసం 3 నెలల్లో అయోధ్య ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయోధ్యలోనే బాబ్రీ మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్‌ బోర్డుకు 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తెలిపింది.

అయోధ్యలో రామమందిరం నిర్మించాలని1993లో అడ్వాణీ పెద్ద ఎత్తున ఉద్యమించిన సంగతి తెలిసిందే. సోమనాథ నుంచి రథయాత్ర కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ ఆగ్రనేత అడ్వాణీ స్వాగతిచారు. ఇది కల నెరవేరిన క్షణం, రామజన్మభూమికి దేశ వారసత్వ సంపదల్లో ఎంతో గౌరవం ఉందన్నారు. కోట్లది మంది భారతీయుల హృదయాల్లో రామజన్మభూమికి పవిత్ర స్థానం ఉంది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ప్రజల నమ్మకాలను గౌరవించేలా తీర్పు ఇవ్వడం సంతోషకర విషయం, దేశంలో హింసకు చోటివ్వకుండా శాంతిని నెలకొల్పే సమయం ఆసన్నమైంది. కోర్టు తీర్పును గౌరవించాలని మసీదుకు ఐదు ఎకరాల స్థలం ఇవ్వడాన్ని అడ్వాణీ స్వాగతించారు.

Next Story