హరియాణాలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ

హరియాణాలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ
x
Highlights

హరియాణాలో హంగ్ రాజకీయం జోరందుకుంది. పరిస్థితులు బీజేపీకి పూర్తి అనుకూలంగా మారుతున్నాయి. బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తోంది.

హరియాణాలో హంగ్ రాజకీయం జోరందుకుంది. పరిస్థితులు బీజేపీకి పూర్తి అనుకూలంగా మారుతున్నాయి. బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తోంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన బీజేపీ రెబల్ ఎమ్మెల్యే రణ్‌ధీర్ గోలన్ బీజేపీకి మద్దతు తెలిపారు. అంతేకాదు, 30 ఏళ్లుగా తాను బీజేపీ కార్యకర్తనని, తాను బీజేపీలోనే ఉన్నానని ఆయన చెప్పారు. పార్టీని వదిలి తానెక్కడికి పోతానని, బీజేపీ తనకు తల్లిలాంటిదని రణ్‌ధీర్ చెప్పారు.

ఇక దాద్రి నియోజకవర్గం నుంచి గెలిచిన మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సోమ్‌వీర్ సంగ్వాన్ కూడా బీజేపీకే తన మద్దతు అని ప్రకటించారు. దీంతో బీజేపీ బలం 42కి పెరిగింది. మరో నలుగురు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపితే హరియాణాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో ఇప్పటికే బీజేపీ సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. మొత్తం మీద హరియాణాలో మరోసారి మనోహర్ లాల్ ఖట్టర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

హర్యానా బీజేపీ శాసనసభా పక్ష సమావేశం రేపు జరుగుతుందని, ఈ సమావేశంలో పార్టీ శాసనసభా పక్ష నేత ఎంపిక ఉంటుందని ఆ పార్టీ హర్యానా విభాగం ఇన్‌చార్జి అనిల్ జైన్ తెలిపారు. బీజేపీ తాత్కాలిక అధ్యక్షుడు జేపీ నడ్డాతో మనోహర్ లాల్ ఖట్టర్‌ ఇవాళ సమవేశమైన అనంతరం.. అనిల్ జైన్ ఈ ప్రకటన చేశారు.

రేపు మధ్యాహ్నం 11 గంటలకు ఛండీగఢ్‌లో లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పరిశీలకులుగా హాజరవుతారు. బీజేపీ శానససభా పక్ష నేత ఎన్నిక తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కోరుతూ గవర్నర్‌ను పార్టీ నేతలు కలవనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories