పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు

BJP Ruled States Also Reduce the VAT on Petrol and Diesel
x

పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు

Highlights

*పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు *రూ.7 వ్యాట్ తగ్గించిన అసోం, గోవా, మణిపూర్, త్రిపుర, కర్ణాటక, సిక్కిం

Petrol and Diesel Price: దేశ ప్రజలకు దీపావళి సందర్భంగా కేంద్ర సర్కార్ గుడ్‌ న్యూస్ చెప్తూ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ఇదే సమయంలో రాష్ట్రాలకూ వీలైనంత వ్యాట్ తగ్గించాల్సిందిగా విజ్ఞప్తి కూడా చేసింది. దీంతో పలు రాష్ట్రాలు కేంద్రం బాటలో నడుస్తున్నాయి. ఇంతకాలం ఎక్సైజ్ సుంకానికి అనుగుణంగా వ్యాట్ పెంచేస్తూ వచ్చిన రాష్ట్రాలు.. ఇప్పుడు తగ్గించే పనిలో పడ్డాయి. ఆ జిబితాలోకి బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, అసోం, గుజరాత్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌, మణిపూర్, ఒడిశాలు చేరాయి.

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తన గుండెను తాకిందన్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా ప్రజలకు మేలు చేసేందుకు అసోంలో పెట్రోల్, డీజిల్‌పై ఏడు రూపాయల వ్యాట్ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అటు గోవాలోనూ పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ట్వీట్ చేసిన గోవా సీఎం ప్రమోద్ సావంత్ పెట్రోల్, డీజిల్‌పై ఏడు రూపాయల వ్యాట్ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

అసోం, గోవాల బాటలోనే పయనిస్తూ మణిపూర్, త్రిపుర, కర్ణాటక, సిక్కిం ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై ఏడు రూపాయల వ్యాట్ తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఇదే సమయంలో బీహార్‌లోని నితీశ్ కుమార్ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి పెట్రోల్‌పై 1.30 పైసలు, డీజిల్‌పై 1.90 పైసలు వ్యాట్ తగ్గించింది. ఇక ఉత్తరాఖండ్‌లో రెండు రూపాయల వ్యాట్ తగ్గించగా ఒడిశాలో మూడు రూపాయలు తగ్గిస్తూ నవీన్ పట్నాయక్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు యూపీలోని యోగి సర్కార్ కేంద్రం తగ్గింపుతో కలుపుకొని 12 రూపాలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories