ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ లీడర్ ను కాల్చిచంపిన దుండగులు

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ లీడర్ ను కాల్చిచంపిన దుండగులు
x
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు హత్యకు గురయ్యారు. నివేదికల ప్రకారం, బైక్ ద్వారా వచ్చిన దుండగులు బీజేపీ నాయకుడిని...

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు హత్యకు గురయ్యారు. నివేదికల ప్రకారం, బైక్ ద్వారా వచ్చిన దుండగులు బీజేపీ నాయకుడిని తుపాకీతో కాల్చి చంపారు. మృతుడుని బిజెపి ఫిరోజాబాద్ మండలం ఉపాధ్యక్షుడు డికె గుప్తాగా గుర్తించారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ సంఘటన జరిగింది.. కాల్పులు జరిపిన తరువాత దాడి చేసినవారు అక్కడి నుంచి పరారయ్యారు. నవంబర్ 3 న జరగనున్న తుండ్లా ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు..

ఈ క్రమంలో డికె గుప్తా తన కిరాణా షాపులోనుంచి బయలుదేరుతుండగా.. అప్పుడే బైక్‌పై ముగ్గురు దుండగులు వచ్చిఆయనపై కాల్పులు జరిపి పారిపోయారు. గాయపడిన గుప్తాను స్థానికులు గమనించి ఆగ్రాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అయితే అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనను సృష్టించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories