Breaking: రాత్రి 7 గంటలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న శివరాజ్ సింగ్ చౌహాన్

Breaking: రాత్రి 7 గంటలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న శివరాజ్ సింగ్ చౌహాన్
x
Sivaraj Singh Chouhan (file photo)
Highlights

బిజెపికి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు రాత్రి 7 గంటలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

బిజెపికి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు రాత్రి 7 గంటలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం కూడా ఆయన ఎంపికను ఖరారు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి లేకపోవడంతో ప్రభుత్వం సుప్త చేతనా వ్యవస్థలో ఉంది. మరోవైపు కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలని భావించిన గవర్నర్.. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు. దీంతో ఇవాళ సాయంత్రం శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీని కోల్పోయిన కొన్ని రోజుల తరువాత.. శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విశ్వాస ఓటులో తన మెజారిటీని నిరూపించుకోవడానికి సుప్రీంకోర్టు విధించేసిన గడువుకు ముందే కమల్ నాథ్ ముఖ్యమంత్రి పదవికి గురువారం రాజీనామా చేశారు. జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలు బెంగళూరుకు వెళ్ళి అక్కడినుంచి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ మెజారిటీని కోల్పోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ బలం నిరూపించుకోలేక చతికిల పడింది. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా నిన్న బిజెపిలో చేరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories