ఉప ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ!

ఉప ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ!
x
Highlights

ఉప ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోయింది. దేశవ్యాప్తంగా పలు కారణాలతో జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుని ఎదురులేదనిపించుకుంది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ ఎన్నికలు కూడా ఏమాత్రం కలిసిరాలేదు.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మోడీకి ఎదురు లేదని నిరూపించాయి ఈ ఉప ఎన్నికలు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనానికి అద్దం పట్టేలా ఉప ఎన్నికల ఫలితాలు ఉన్నాయి.

మొత్తం 11 రాష్ట్రాల్లో 59 స్థానాలకు తాజాగా ఉప ఎన్నికలు నిర్వహించారు. వీటిలో అత్యధిక స్థానాలను భారతీయ జనతా పార్టీ గెల్చుకుంది.

* మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ 18 సీట్లను దక్కించుకొని, మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఫలితంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం పడిపోయే ముప్పు తప్పింది. * గుజరాత్‌లో ఉప ఎన్నికలు జరిగిన 8 స్థానాలూ కమలం ఖాతాలోకే చేరాయి.

* ఉత్తర్‌ ప్రదేశ్‌లోనూ ఆ పార్టీ తన పట్టు నిలబెట్టుకుంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో 7 స్థానాలకుగాను ఆరింటిని కమలనాథులు కైవసం చేసుకున్నారు. మరో సీటును సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) దక్కించుకుంది. 2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఊపులో విజయకేతనం ఎగురవేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు.

* మధ్యప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థులు 8 స్థానాల్లో గెలుపొందారు. మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

* కర్ణాటకలోని రెండు విధాన సభ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ విజయం సాధించింది.

* మణిపుర్‌లో 5 స్థానాలకుగాను 4 బీజేపీ ఖాతాలోకి చేరాయి.

* ఒడిశాలో రెండు చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో భాజపాపై అధికార బిజూ జనతాదళ్‌ (బీజేడీ)దే పైచేయి అయింది.

* ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు ఊరట లభించింది. మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి మరణించడంతో ఖాళీ అయిన మర్వాహీలో బీజేపీను కాంగ్రెస్‌ ఓడించింది.

* ఝార్ఖండ్‌లో రెండు స్థానాల్లోనూ భారతీయ జనతాపార్టీకి చుక్కెదురైంది. ఓ స్థానాన్ని జేఎంఎం, మరో సీటును కాంగ్రెస్‌ దక్కించుకున్నాయి.

* నాగాలాండ్‌లో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించగా నేషనలిస్ట్‌ డెమొక్రాటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ) ఒక స్థానాన్ని సాధించగా, స్వతంత్ర అభ్యర్థి మరోచోట గెలుపొందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories