బీజేపీపై చిదంబరం కీలక వ్యాఖ్యలు

బీజేపీపై చిదంబరం కీలక వ్యాఖ్యలు
x
Chidambaram File Photo
Highlights

జార్ఖండ్‌ అసెంబ్లీ ఫలితాల్లో అధికార బీజేపీకి కొలుకోలేని దెబ్బ తగిలింది.

జార్ఖండ్‌ అసెంబ్లీ ఫలితాల్లో అధికార బీజేపీకి కొలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ - జేఎంఎం కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. మొత్తం 81 స్థానాల్లో ఎన్నికలు జరగగా ప్రభుత్వ ఏర్పాటుకు 42 స్థానాలు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్‌-జేఎంఎం కూటమి 49 స్థానాల్లో ముందంజలో ఉంది. 21 స్థానాల్లో బీజేపీ ముందజలో కొనసాగుతోంది. ఇతరులు మిగతా స్థానాల్లో విజయం దిశగా పయనిస్తున్నారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు అధికార బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ - జేఎంఎం కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. మొత్తం 81 స్థానాల్లో ఎన్నికలు జరగగా ప్రభుత్వ ఏర్పాటుకు 42 స్థానాలు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్‌-జేఎంఎం కూటమి 49 స్థానాల్లో ముందంజలో ఉంది. 21 స్థానాల్లో బీజేపీ ముందజలో కొనసాగుతోంది. ఇతరులు మిగతా స్థానాల్లో విజయం దిశగా పయనిస్తున్నారు.

జార్ఖండ్‌ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీజేపీపై ప్రతిపక్షలు విమర్శలకు మరింత పదును పెడుతున్నా యి. ఈ క్రమంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరం దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ఈ ఎన్నికల ఫలితాలు చెప్పపెట్టని విమర్శించారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీని ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ఆయన బీజేపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఎన్డీయే యేతర పార్టీలన్నీ కాంగ్రెస్‌తో కలిసి దేశ రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌, హర్యానాలో కూడా బీజేపీని ప్రజలు తిరస్కరించారు. దేశంలోని ప్రతిపక్షాలు ఏకమైతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం అని ట్వీట్ చేశారు.

ఇప్పటికే శివసేన, ఎన్సీపీలు కూడా స్పందించాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ.. బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన,ఎన్సీపీ నేతలు స్పందిచారు. బీజేపీపై ప్రజలకు నమ్మకం తగ్గుతోందని, అందుకు జార్ఖండ్‌ ఫలితాలు ఉదాహరణ అంటూ ఎన్సీపీ వ్యాఖ్యానించింది. మోదీ, అమిత్ షా అహంకారానికి జార్ఖండ్ ప్రజలు గుణపాఠం చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories