బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ఖరారు

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ఖరారు
Draupadi Murmu: ద్రౌపది పేరును ప్రకటించిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
Draupadi Murmu: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించడంతో రాష్ట్రపతి ఎన్నికలు కీలక మలుపు తిరిగాయి. భారత రాష్ట్రపతిగా పోయినసారి ఈమె పేరు తెరపైకి వచ్చినా చివరి ఈక్వేషన్స్‌లో రాంనాథ్ కోవింద్ ఆ అవకాశాన్ని దక్కించుకున్నారు. అయితే మరోసారి రాష్ట్రపతి అభ్యర్ధిగా గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము పేరును ప్రకటించి విపక్షాలకు షాకిచ్చింది బీజేపీ. గిరిజన తెగకు చెందిన నేతే కాకుండా జార్ఘండ్ గవర్నర్‌గా పనిచేసిన అనుభవం ద్రౌపది ముర్ముకు ఉండడంతో..ఆసారి జరిగే రాష్ట్రపతి ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను విపక్షాలు ప్రకటించడంతో..యశ్వంత్ సిన్హా వర్సెస్ ద్రౌపతి ముర్ము మధ్య పోరు కొనసాగనుంది.
ఒడిశాలోని ఓ సాధారణ ఆదివాసీ గిరిజన మహిళ స్థాయి నుంచి రాష్ట్రమంత్రి, గవర్నర్ స్థాయికి ఎదిగారు ద్రౌపది ముర్ము. ఆమెకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం ద్వారా మహిళకు ఆదివాసీలకు అత్యున్నత స్థానం ఇవ్వడంతో పాటు ఓ మహిళకు దేశ అత్యున్నత పదవి ఇచ్చినట్టు అవుతుందని బీజేపీ నాయకత్వం భావించింది. ఈ క్రమంలోనే రాష్ట్రపతి పదవి కోసం ద్రౌపది ముర్మును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన మరియు గిరిజన సంఘం నుండి వచ్చిన ముర్ము ఉపాధ్యాయురాలిగా ప్రారంభించి ఒడిశా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె మయూర్‌భంజ్‌లోని రాయంగ్‌పూర్ నుంచి 2000, 2009లో బిజెపి టిక్కెట్‌పై రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.
అంతకుముందు 1997లో రాయంగ్‌పూర్ నగర్ పంచాయతీకి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. BJP తరపున షెడ్యూల్డ్ తెగల మోర్చా ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన తర్వాత, 2000లో రాయంగ్‌పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిశాలోని బీజేడీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2000-2004 మధ్యకాలంలో వాణిజ్యం, రవాణా శాఖ, ఆ తరువాత ఫిషరీస్, జంతు వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2015లో ముర్ము జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసి ఐదేళ్లు పూర్తికాలం గవర్నర్ పదవిలో కొనసాగారు.
వాస్తవానికి ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలన్న దానిపై బీజేపీ అధిష్టానం భారీ కసరత్తే చేసింది. ఎవ్వరూ ఊహించని రీతిలో..ద్రౌపది ముర్ము పేరును ప్రకటించి విపక్షాలకు బిగ్ షాకిచ్చింది మోడీ సర్కార్. ఆజాది అమృతోత్సవంలో భాగంగా ద్రౌపదికి అవకాశం ఇస్తే, తొలిసారి గిరిజన మహిళ దేశానికీ రాష్ట్రపతి అయి రికార్డు సృష్టించనున్నారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT