మహారాష్ట్ర : అజిత్ పవార్ పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్ర : అజిత్ పవార్ పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
x
BJP Chief Amit Shah
Highlights

తాజా అజిత్ శరద్‌ పవార్‌ ఎత్తుల ముందు బీజేపీ ప్రభుత్వం మూనాళ్ల ముచ్చటైంది. ఎట్టకేలకు అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి తిరిగి సొంత గూటికి వచ్చారు.

తాజాగా అజిత్ శరద్‌ పవార్‌ ఎత్తుల ముందు బీజేపీ ప్రభుత్వం మూనాళ్ల ముచ్చటైంది. ఎట్టకేలకు అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి తిరిగి సొంత గూటికి వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఓ ప్రకటన చేశారు. అజిత్ పై కేసులు ఎత్తివేయలేదని,క్లీన్ చిట్ వచ్చిందన్న కథనాలు అవాస్తమన్నారు. బీజేపీ మద్దతు అజిత్ పవారే ఇచ్చారని స్పష్టం చేశారు.

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు ఎన్నో మలుపులు తిరిగిన విషయం విథితమే. అయితే బీజేపీతో జతకట్టి ఎన్సీపీనేత అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత సుప్రీం కోర్టు తీర్పుతో తన పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్సీపీ గూటికి చేరిన చేరారు.

ఈ నేపథ్యంలో అజిత్ పవార్ బీజేపీవైపు వెళ్లడంపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. అజిత్ పవార్ పై ఈడీ కేసులు ఉన్నాయి, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు రూ.70వేల కోట్లు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసుల నుంచి ఉపశమనం పొందేందుకు బీజేపీకీ మద్దతు ఇచ్చారని కథనాలు వచ్చాయి. బీజేపీతో మద్దతు ఇచ్చిన తర్వాత కేసులు మాఫీ అయ్యాయని, ఈడీ నుంచి క్లీన్ చిట్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆసక్తినిరేకెత్తిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories