Bird Flu: క్రమంగా విస్తరిస్తోన్న బర్డ్‌ఫ్లూ

Bird flu virus expanded to the 7 states in India
x

representational image

Highlights

Bird Flu: * ఏడు రాష్ట్రాలకు విస్తరించినట్టు ప్రకటించిన కేంద్రం * కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, యూపీ * ఛత్తీస్‌ఘడ్ లో అకారణంగా మరణించిన పక్షులు

ఇండియాలో పక్షులు, బాతుల్లో బయటపడిన ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా ఏడు రాష్ట్రాలకు బర్డ్‌ఫ్లూ విస్తరించినట్టు కేంద్ర పాడి పశుసంవర్ధక మంత్రిత్వశాఖ వెల్లడించింది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, యూపీ రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ నిర్ధారించినటట్టు ప్రకటించింది. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో అకారణంగా పక్షులు మరణించినట్టు నివేదిక అందినట్ట ప్రకటించారు. అయితే.. పక్షులకు ఏవీయస్ ఇన్ ఫ్లూయెంజా సోకిందా లేదా తెలుసుకునేందుకు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు.

దేశంలో బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ విస్తర‌ణ నేప‌థ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో కోళ్లు, ఇత‌ర ప‌క్షుల దిగుమ‌తిపై నిషేధం విధించింది. ఇటీవ‌ల దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. ఇదే క్రమంలో వందలాది పక్షులు మ‌ృత్యువాత పడ్డాయి. ఢిల్లీలోనూ వ‌రుస‌గా ప‌క్షులు మృత్యువాత ప‌డుతుండ‌టంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్‌ను మ‌రో 10 రోజుల‌పాటు మూసి వేస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. అన్ని రాష్ట్రాలు తక్షణమే తగిన చర్యలు తీసుకొని బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా చూడాలని కేంద్రం కోరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories