బ‌ర్డ్ ఫ్లూ ఎఫెక్ట్: భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఏపీలోనూ తగ్గిన అమ్మకాలు

బ‌ర్డ్ ఫ్లూ ఎఫెక్ట్: భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఏపీలోనూ తగ్గిన అమ్మకాలు
x
Highlights

దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, హర్యానా, రాజస్థాన్‌, కేరళ రాష్ట్రాల బర్డ్ ఫ్లూ భయం బెంబేలెత్తించింది.

దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, హర్యానా, రాజస్థాన్‌, కేరళ రాష్ట్రాల బర్డ్ ఫ్లూ భయం బెంబేలెత్తించింది. ఇప్పటికే ఏవియన్‌ ఇన్‌ప్లూయెంజా వైరస్‌ బారిన పడిన వేలాది పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే ఈ రకమైన ఫ్లూ బయటపడినట్టు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ తెలిపింది. వలస పక్షుల్లోనే ఎక్కువగా ఈ ఫ్లూ కనిపిస్తోందని కేంద్రం వెల్లడించింది. బర్డ్ ఫ్లూ కారణంగా దేశ వ్యాప్తంగా చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. రాబోయే రోజుల్లో చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది.

ఫ్లూ భయంతో చికెన్ ధరలు 50 శాతం తగ్గినా కొనేందుకు మంసం ప్రియూలు ముందుకు రావడం లేదు. చికెన్‌లో ఏదైనా వైరస్‌ ఉంటే 60-70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చనిపోతుందని నిపుణులు చెబుతున్నా.. చాలామంది బర్డ్‌ ఫ్లూ భయంతో దానికి దూరంగా ఉంటున్నారు. అటు ఫ్లూ భయంతో చికెన్‌, ఎగ్స్‌ ధరలు పడిపోయాయి. కోడి మాంసం కొనేందుకు జనాలు ముందుకు రావడం లేదు. వ్యాపారులు ఇప్పుడు 10 నుంచి 20 శాతం చికెన్ అమ్మకాలు కూడా చేయలేకపోతున్నారు. గత మూడు నాలుగు రోజుల్లో చికెన్ అమ్మకాలు 70-80 శాతం మేర పడిపోగా.. ధరలు 50 శాతం క్షీణించాయి. అటు, కోడి గుడ్డ ధర కూడా 15-20 శాతం పడిపోయింది.

కరోనా చికెన్ వ్యాపారాన్ని భారీగా దెబ్బతీస్తే, ఇప్పుడు బర్డ్‌ ఫ్లూతో మళ్లీ కష్టాలు వచ్చాయని చికెన్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, చికెన్ షాపులు వెలవెలబోతుంటే చేపల మార్కెట్లకు మంచి గిరాకీ వచ్చింది. గతంలో కొర్రమీను కిలో 400- 450 రుపాయల మధ్య విక్రయించగా.. ప్రస్తుతం ఇది రూ.500-600గా పెరిగింది. రొయ్యలు కిలో రూ.400, రవ్వ చేప రూ. 130-150, బొచ్చ చేప రూ. 120-140 వరకు విక్రయిస్తున్నారు. . ఆన్‌లైన్‌లోనూ చేపల విక్రయాలు పెరిగాయి. బర్డ్ ఫ్లూపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కోడి, బాతు మాంసం, గుడ్లు నిర్భయంగా తినొచ్చని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. చికెన్‌ను శుభ్రంగా కడిగి బాగా వేడి చేసుకుని తినాలని అధికారులు సూచిస్తున్నారు. హాటళ్లలో పెట్టే చికెన్ నాణ్యతపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం చికెన్ ధరలపై పడింది. కోళ్ల మరణాలతో జనం ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో చికెన్ ధరలు పతనమైయ్యాయి. ఆంధ్రాలోనూ చికెన్ వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. సంక్రాంతి టైంలో చికెన్ వ్యాపారం జోరుగా సాగుతుంది. అయితే ఈ సారి మాత్రం చికెన్ సెల్స్ చాలా వరకు పడిపోయిందని, కిలో.రూ. 240 కు నుంచి 170 రూపాయలకు విక్రయించినా కోనేందుకు జనం ముందుకు రావడం లేదని వాపారులు వాపోతున్నారు. తెలంగాణలో హైదరాబాద్ మినహా విగతా చోట్ల ఇదే సీన్ రిపీట్ అవుతోంది. నిన్న హైదరాబాద్ చికన్ మార్కెట్ కళకళాడింది. అయితే ధరలు మాత్రం గత పది రోజులుగా 180రూపాయలుగానే ఉంది. ఇక నిన్నమొన్నటి వరకు రాష్ట్రంలో చికెన్ ధరలు కేలో 250 రూపాయిలు ఉండేది. గుడ్లను కూడా కొనేందుకు ముందుకు రావడం లేదని వ్యాపారులు అంటున్నారు. ఇప్పుడు 180 రూపాయల నుంచి 160 రూపాయల వరకు ఉంది. పక్క రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories