Election Commission: పోలింగ్‌‌కు 72 గంట‌ల ముందు బైక్ ర్యాలీల‌పై నిషేధం

Bike Rallies Shall not be Allowed at 72 Hours Before Date of Poll
x

Election Commission:(ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Election Commission: ఎన్నిక‌లు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్‌‌కు 72 గంట‌ల ముందు బైక్ ర్యాలీల‌పై ఈసి నిషేధించింది.

Election Commission: ఎన్నిక‌లు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్‌‌కు 72 గంట‌ల ముందు బైక్ ర్యాలీల‌పై నిషేధం విధిస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధ‌న రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వ‌ర్తిస్తుంద‌ని ఈసీ స్ప‌ష్టం చేసింది. అయితే.. పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిలిపివేస్తున్న విష‌యం తెలిసిందే. పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మయ్యే స‌మ‌యం వ‌ర‌కు కొద్ది మంది బైక్‌ల‌పై తిరుగుతూ.. ఓట‌ర్ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్న‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని ఈసీ తెలిపింది. ఈ కార‌ణంగానే తాజాగా బైక్ ర్యాలీల‌పై పోలింగ్‌కు మూడు రోజుల ముందే నిషేధం విధించింనట్లు ఈసీ తెలిపింది.

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 26 షెడ్యూల్ విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి విడతల వారీగా ఎన్నికలు జరగనున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్‌లో 294 స్థానాలకు, తమిళనాడులో 234 స్థానాలకు, కేరళలో 140 స్థానాలకు, అసోంలో 126 స్థానాలకు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మే 2న చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories