Viral Video: గురువులా గూండాలా..విద్యార్థుల ఎదుటే టీచర్ల కుమ్ములాట.. నెట్టింట వీడియో వైరల్

Bihar Headmistress Teachers brawl In Front Of Students
x

Viral Video: గురువులా గూండాలా..విద్యార్థుల ఎదుటే టీచర్ల కుమ్ములాట.. నెట్టింట వీడియో వైరల్

Highlights

Viral Video: అయితే ఇక్కడ కొట్టుకుంది పిల్లలు కాదు...వారికి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు.. ఔను, టీచర్-ప్రిన్సిపల్ ఇద్దరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.

Viral Video: ఓ చీర కోసం ఇద్దరు మహిళలు కొట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం మనందరికీ గుర్తుండే ఉంటుంది కదా..బెంగళూరులోని ఓ షాపింగ్ మాల్ లో ఇద్దరు మహిళలు ఓ చీర తనదంటే తనది అంటూ ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని మరీ రెచ్చిపోయారు. అలాంటి ఘటనే బిహార్ లో చోటు చేసుకుంది. ఇక్కడ ఇద్దరు మహిళలు తలపడ్డారు.

స్కూల్ అంటున్నాం కదా అని ఇద్దరు విద్యార్థినులు కొట్టుకొని ఉంటారని మీరు అనుకుంటున్నారా..స్కూల్ కాబట్టి పిల్లలు కొట్టుకోవడం సహజమే..ఇందులో వింతేముందని మీకు డౌట్స్ వస్తున్నాయా..అయితే ఇక్కడ కొట్టుకుంది పిల్లలు కాదు...వారికి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు..ఔను, టీచర్-ప్రిన్సిపల్ ఇద్దరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...బిహార్ రాజధాని పాట్నాలోని బిహ్తా బ్లాక్ కౌరియా పంచాయతీ పాఠశాలలో కాంతి కుమారి ఇంఛార్జ్ ప్రిన్సిపల్ గా పని చేస్తున్నారు. అదే పాఠశాలలో అనితా కుమారి ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. అయితే కొన్ని నెలలుగా వీరిమధ్య వివాదం నడుస్తోంది. గత గురువారం ఈ వివాదం శృతిమించి ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంతవరకు వెళ్లింది. పాఠశాలలో ఉన్నాం..విద్యార్థులు చూస్తున్నారని ఏమాత్రం ఆలోచన లేకుండా ఇద్దరు ఒకరిపై ఒకరు కలబడ్డారు. వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. ఇద్దరు మహిళల కొట్టాటలో మరో టీచర్ కూడా చేరి చెప్పుతో ఓ మహిళను కొట్టడం..జరిగింది. ఈ మహిళా సంగ్రామానాన్ని అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి నెట్టింట పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది.

ఈ వివాదం పై విద్యాశాఖ ఉన్నతాధికారులకు బిహ్తా బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే..విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులే..వీధిరౌడీలను మించి పోయేలా కొట్టుకోవడం...ఉపాధ్యాయ లోకానికే కాకుండా సమాజానికి సైతం మాయని మచ్చ అని విమర్శలు చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories