NRCకి వ్యతిరేకంగా తీర్మానం చేసిన మొదటి NDA పాలిత రాష్ట్రం

NRCకి వ్యతిరేకంగా తీర్మానం చేసిన మొదటి NDA పాలిత రాష్ట్రం
x
Highlights

బీహార్ లో భాగస్వామి పార్టీ అయిన అధికార జేడీయూ.. కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. బీహార్ అసెంబ్లీలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) కు...

బీహార్ లో భాగస్వామి పార్టీ అయిన అధికార జేడీయూ.. కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. బీహార్ అసెంబ్లీలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. అంతేకాదు 2010 లో అమలు చేసిన npr నే అమలు చేయాలనీ ఆ రాష్ట్రం నిర్ణయించింది. దీంతో ఎన్‌ఆర్‌సి కి వ్యతిరేకంగా తీర్మానం చేసిన మొదటి nda పాలిత రాష్ట్రం బీహార్ అయినట్టయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జేడీయూ, బీజేపీ పార్టీలు పొత్తు కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి ఎన్‌ఆర్‌సికి అనుకూలంగా పార్లమెంటు జేడీయూ మద్దతు పలికిన సంగతి తెలిసిందే.

మరోవైపు బీహార్ శాసనసభలో జరుగుతున్న ఈ బడ్జెట్ సమావేశాల్లో రాజకీయ ఎత్తుగడలు చాలా వేగంగా మారుతున్నాయి. శాసనసభ నుండి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి) మరియు జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పిఆర్) కు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించబడిన తరువాత భారతీయ జనతా పార్టీ (బిజెపి), ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు ప్రతిపక్ష నాయకుడు తేజశ్వి యాదవ్.. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో మంగళవారం సమావేశమయ్యారు. ఇది అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై భేటీ అయి ఉంటారు అని అనుకోవచ్చు..

వీరి భేటీ తర్వాత ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌పై ప్రతిపాదనలను సభలో ఆమోదించారు. ఈ క్రమంలో బుధవారం కూడా నితీష్, తేజస్వి మరోసారి ఒకే గదిలో సమావేశమయ్యారు. దీంతో బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకుంటుందా? అనే ప్రచారం నేతల్లో మొదలయింది. ఇప్పటి వరకు, నితీష్ కుమార్ ను బహిరంగంగా విమర్శిస్తున్న తేజశ్వి, హఠాత్తుగా ఆయనను కలవడంపై మీడియాలో కథనాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎవరికీ వారు ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి 2015 ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాయి. ఆ తరువాత లాలూ ప్రసాద్ యాదవ్ కు జైలు శిక్ష పడడంతో ఆర్జేడీ, కాంగ్రెస్ నుంచి విడిపోయి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జేడీయూ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories