Delhi Assembly Elections 2025: ఎన్నికల ముందు కేజ్రీవాల్ కు బిగ్ షాక్..8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా

Delhi Assembly Elections 2025: ఎన్నికల ముందు కేజ్రీవాల్ కు బిగ్ షాక్..8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా
x
Highlights

Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 8మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ పార్టీ అధినేత అరవింద్...

Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 8మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై తమ విశ్వాసం పోయిందని శుక్రవారం పార్టీకి రాజీమానా చేశారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలో త్రిలోక్ పురికి చెందిన రోహిత్ మెహ్రౌలియా, కస్తూర్భానగర్ కు చెందిన మదన్ లాక్, జనక్ పురికి చెందిన రాజేష్ రిషి, పాలంకు చెందిన భావనా గౌడ్, బిజ్వాసన్ కు చెందిన భూపేందర్ సింగ్ జూన్, ఆదర్స్ నగర్ కు చెందిన పవర్ కుమార్ శర్మ ఉన్నారు. ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫిబ్రవరి 5న జరిగిన ఎన్నికల్లో టికెట్లు నిరాకరించడంతో ఈ ఎమ్మెల్యేలు అసంత్రుప్తిలో ఉన్నారని..ఇతర పార్టీలతో టచ్ లో ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఎన్నికల్లో టిక్కెట్ రాకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అవినీతి, ఇతర సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. గిరీష్ సోనీ తన రాజీనామా లేఖ కాపీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా కాలంగా జరుగుతున్న కార్యకలాపాలు. ఈ సమస్యలన్నింటికీ దిగ్భ్రాంతి చెంది, ఈ రోజు నేను ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని బాధ్యతల నుండి, ఆమ్ ప్రాథమిక సభ్యత్వం నుండి విరమించుకుంటున్నాను. ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తున్నానను అని పేర్కొన్నారు.

గిరీష్ సోనీ కంటే ముందు, కస్తూర్బా నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ లాల్, తాను మరో ఆరుగురు పార్టీ ఎమ్మెల్యేలు ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారని పేర్కొన్నారు. తన రాజీనామాను ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్‌కు కూడా పంపినట్లు మదన్ లాల్ తెలిపారు. రాజీనామా చేసిన ఆప్ ఎమ్మెల్యేలలో భావన గౌర్ (పాలెం), నరేష్ యాదవ్ (మెహ్రౌలీ), రోహిత్ మెహ్రౌలియా (త్రిలోక్‌పురి) పవన్ శర్మ (ఆదర్శ్ నగర్), బిఎస్ జూన్ (బిజ్వాసన్), రాజేష్ రిషి (జనక్‌పురి) కూడా ఉన్నారు.

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో లేరని, అందుకే వారికి ఎన్నికల టిక్కెట్లు ఇవ్వలేదని పార్టీ నిర్వహించిన సర్వేలో వెల్లడైందని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి రీనా గుప్తా విమర్శించారు. సర్వే ప్రతికూల ఫలితాల కారణంగా మేము వారికి టిక్కెట్ ఇవ్వలేదు అని గుప్తా చెప్పారు. టికెట్ రాకపోవడంతో ఇప్పుడు వేరే పార్టీలో చేరడం పెద్ద విషయం కాదు. ఇది రాజకీయాల్లో భాగమే అన్నారు. ఫిబ్రవరి 5న జరగనున్న ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఉన్న 16 మంది ఎమ్మెల్యేల స్థానంలో కొత్త ముఖాలను రంగంలోకి దించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories