SSY: సుకన్య సమృద్ధి యోజనలో 5 పెద్ద మార్పులు.. డిపాజిట్‌ చేసేముందు ఇవి గమనించండి..!

Big Changes in Sukanya Samridhi Yojana Note These Before Making a Deposit
x

SSY: సుకన్య సమృద్ధి యోజనలో 5 పెద్ద మార్పులు.. డిపాజిట్‌ చేసేముందు ఇవి గమనించండి..!

Highlights

SSY: సుకన్య సమృద్ధి యోజనలో 5 పెద్ద మార్పులు.. డిపాజిట్‌ చేసేముందు ఇవి గమనించండి..!

SSY: బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం కింద కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం బాలికల బంగారు భవితకు భరోసాగా నిలుస్తుంది. పొదుపు పథకాలపై బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల కన్నా సుకన్య సమద్ధి యోజన అందించే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉండడం విశేషం. ఈ పథకం కింద ఏడాదికి ఒకసారి సవరించి దానిని కేంద్ర బడ్జెట్‌ సమయంలో ప్రకటిస్తుంది. అయితే ఈ పథకంలో జరిగిన ఐదు మార్పుల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

1. అనివార్య కారణాల వల్ల కూతురు లోకం విడిచినా లేదంటే నివాసం మారినప్పుడు 'సుకన్య సమృద్ధి యోజన' ఖాతాను ముందుగా మూసివేయవచ్చు. ఇప్పుడు కొత్తగా ఖాతాదారునికి ప్రాణాంతకమైన అనారోగ్యం కూడా ఇందులో చేరిపోయింది. సంరక్షకుడు మరణించిన సందర్భంలో కూడా ఖాతాను ముందుగానే మూసివేయవచ్చు.

2. ఇంతకుముందు 80సి కింద పన్ను మినహాయింపు ప్రయోజనం ఇద్దరు కుమార్తెలకి మాత్రమే అందుబాటులో ఉండేది. దీంతో మూడో కూతురికి ఈ పథకం వర్తించేది కాదు. అయితే ఇప్పుడు ఒక కుమార్తె తర్వాత ఇద్దరు కవలలు పుడితే వారిద్దరి పేరుపై ఖాతా ఓపెన్ చేయవచ్చు.

3. ఖాతాలో ఏటా కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1.5 లక్షలు జమ చేయాలనే నిబంధన ఉంది. కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే ఖాతా డిఫాల్ట్ అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయకపోతే మెచ్యూరిటీ వరకు ఖాతాలో జమ చేసిన మొత్తంపై వడ్డీని చెల్లిస్తూనే ఉంటారు. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు.

4. ఇంతకు ముందు కుమార్తె 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఖాతాను నిర్వహించవచ్చు. కానీ కొత్త నిబంధనల ప్రకారం 18 ఏళ్లలోపు ఖాతాను ఆపరేట్ చేయడానికి అనుమతించరు. ఈ వయస్సు వరకు సంరక్షకుడు మాత్రమే ఖాతాను నిర్వహిస్తారు.

5. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ఖాతా వార్షిక వడ్డీ జమ అవుతుంది. ఆ మొత్తానికి మళ్లీ వడ్డీ ప్రారంభమవుతుంది. వడ్డీ, చక్రవడ్డీ రూపంలో జమ అవుతుంది. దీంతో లబ్ధిదారులకు ఎక్కువ మొత్తంలో ప్రయోజనం చేకూరే అవకాశం కలుగుతుంది.

6. బాలికలకు 18 ఏళ్లు నిండిన తర్వాత చదువు లేదా వివాహం కోసం ఈ ఖాతాల్లో ఉన్న నిల్వల్లో 50 శాతం నగదును తీసుకోవచ్చు. 21 ఏళ్లు నిండిన వెంటనే ఖాతాలోని మొత్తం సొమ్మును ఉపసంహరించుకోవచ్చు. లేదా వివాహమైన తర్వాత ఖాతాను రద్దు చేసుకునే వీలు ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories