నేడే భూపేంద్ర పటేల్‌కు పట్టం.. సీఎంగా రెండోసారి ప్రమాణం

* హాజరు కానున్న ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు

R Tripura Malini
Published on: 12 Dec 2022 9:21 AM IST
Bhupendra Patel To Be Sworn In As Gujarat CM Today
X

నేడే భూపేంద్ర పటేల్‌కు పట్టం.. సీఎంగా రెండోసారి ప్రమాణం

Gujarat: గుజరాత్‌ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనను బీజేపీ శాసనసభాపక్ష నేతగా పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి పార్టీ కేంద్ర పరిశీలకులుగా సీనియర్‌ నేతలు రాజ్‌నాథ్‌సింగ్, యడ్యూరప్ప, అర్జున్‌ ముండా హాజరయ్యారు.

అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 2021లో విజయ్‌ రూపానీ స్థానంలో సీఎంగా భూపేంద్ర పగ్గాలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 182 స్థానాలకు గాను.. ఏకంగా 156 సీట్లను కొల్లగొట్టి బీజేపీ రికార్డు విజయం సొంతం చేసుకోవడం తెలిసిందే. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా మంత్రివర్గంతో పాటుగా భూపేంద్ర రాజీనామా చేశారు. బీజేఎల్పీ నేతగా ఎన్నికయ్యాక గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. దీంతో ఇవాళ ఆయన రాష్ట్ర 18వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గాంధీనగర్‌లోని హెలిప్యాడ్‌ మైదానంలో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story