రూ.8 వేల కోట్లు చెల్లించిన ఎయిర్‌టెల్‌.. వొడాఫోన్‌‌‌‌ ఐడియాపై పెరుగుతున్న ఒత్తిడి..

రూ.8 వేల కోట్లు చెల్లించిన ఎయిర్‌టెల్‌.. వొడాఫోన్‌‌‌‌ ఐడియాపై పెరుగుతున్న ఒత్తిడి..
x
Highlights

టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ శనివారం టెలికాం విభాగానికి (డిఓటి) సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ బకాయిల కోసం రూ .8,004 కోట్లు అదనంగా చెల్లించింది.

టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ శనివారం టెలికాం విభాగానికి (డిఓటి) సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ బకాయిల కోసం రూ .8,004 కోట్లు అదనంగా చెల్లించింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా 2020 ఫిబ్రవరి 17 న కంపెనీ చెల్లించిన రూ .10,000 కోట్లకు అదనంగా రూ .8,004 కోట్లు చెల్లించాల్సి ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. డిసెంబర్ 31, 2019 వరకు స్వీయ మదింపు ప్రాతిపదికన లెక్కించినట్లు కంపెనీ తెలిపింది.. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఎజిఆర్) తీర్పునకు అనుగుణంగా కంపెనీ 2006-07 ఆర్థిక సంవత్సరం నుండి 2019 డిసెంబర్ 31 వరకు మరియు ఫిబ్రవరి 29, 2020 వరకు వడ్డీ కలిపిన బకాయిలు చెల్లించినట్టు భారతి ఎయిర్‌టెల్ తెలిపింది. భారతీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల తరపున ఈ పేమెంట్‌ జరిగింది. బాకీల కింద మూడు వేల కోట్ల రూపాయలను, అడ్‌హక్‌ పేమెంట్‌ కింద మరో 5 వేల కోట్ల రూపాయలను చెల్లించింది.

ఈ చెల్లింపులో భారతి ఎయిర్‌టెల్, భారతి హెక్సాకామ్ మరియు టెలినార్ ఇండియా బాధ్యత వహించింది. తాత్కాలిక చెల్లింపుగా అదనంగా 5,000 కోట్ల రూపాయలను కూడా జమ చేసామని ఎయిర్టెల్ తెలిపింది. కాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం అంచనాల ప్రకారం, లైసెన్స్ ఫీజు, చెల్లించని మొత్తానికి వడ్డీ, స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, జరిమానా, దానిపై వడ్డీ సహా ఎయిర్టెల్ చెల్లించాల్సిన మొత్తం దాదాపు రూ .35,586 కోట్లుగా ఉంది.

ఇదిలావుంటే భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ బకాయిలను చెల్లిస్తుండడంతో వొడాఫోన్‌‌‌‌ ఐడియాపై తీవ్రంగా ఒత్తిడి పడుతోంది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గత 14 ఏళ్లకు గాను నాన్‌‌‌‌ కోర్‌‌‌‌‌‌‌‌ వ్యాపార రెవెన్యూలపై ట్యాక్స్‌‌‌‌ను, వీటిపై వడ్డీని, ఫైన్లను కట్టాల్సి వచ్చింది. ఈ తీర్పు ప్రభావం వొడాఫోన్‌‌‌‌ ఐడియాపై ఎక్కువగా పడింది. కంపెనీ రూ. 50,000 కోట్ల బకాయిలను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంత పెద్దమొత్తంలో కట్టలేమని ఈ కంపెనీ రిలీఫ్‌‌‌‌ ప్యాకేజిని ప్రకటించాలని పలుమార్లు కోరింది. అయితే వోడాఫోన్ అభ్యర్ధనపై డిజిటల్‌‌‌‌ కమ్యునికేషన్‌‌‌‌ కమిషన్‌‌‌‌(డీసీసీ) ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో ఈ కంపెనీపై ఒత్తిడి పడుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories