Bharat Bandh: మే 20న భారత్ బంద్.. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల సమ్మే..కారణం ఇదే!

Bharat Bandh: మే 20న భారత్ బంద్.. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల సమ్మే..కారణం ఇదే!
x
Highlights

Bharat Bandh: దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు మే 20 సమ్మె చేపట్టేందుకు నిర్ణయించాయి. కార్మికులకు అనుకూలంగా ఉండాల్సిన శ్రామిక విధానాలు, ఉద్యోగ భద్రత, కనీస...

Bharat Bandh: దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు మే 20 సమ్మె చేపట్టేందుకు నిర్ణయించాయి. కార్మికులకు అనుకూలంగా ఉండాల్సిన శ్రామిక విధానాలు, ఉద్యోగ భద్రత, కనీస వేతన విధానం, పెన్షన్ హక్కులు వంటి అంశాల్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లేబర్ కోడ్ రద్దు,ప్రైవేటీకరణను నిలిపివేయడం, అలాగే ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపడం వంటి డిమాండ్లతో ఈ సమ్మెను నిర్వహించనున్నారు.

కార్మికులు తమ కనీస హక్కుల కోసం పోరాడే పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరం. ప్రభుత్వాలు శ్రామిక చట్టాలను సవరించడం, ప్రైవేటీకరణను వేగవంతం చేయడం కార్మిక వర్గాన్ని ఆర్థికంగా మరింత దెబ్బతీస్తుందని కార్మిక సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. దినసరి కూలీలు, కర్మాగార కార్మికులు, ఇతర రంగాల్లో పనిచేసేవారి జీవితోన్నతికి కనీస వేతనం పెంచడం అవసరమని డిమాండ్ చేస్తున్నారు. కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగుల సేవలో గడిపిన సంత్సరాల క్రుషికి తగిన పెన్షన్ అందకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఏ పథకం కిందకూ రాని నిరుపేద కార్మికులకు నెలకు రూ. 6,000 ఆర్థిక సహాయం అందించాలి. ఈ డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కేంద్ర కార్మిక సంఘాలు, పలు రంగాల స్వతంత్ర సమాఖ్యలు కలిపి కార్మిక జాతీయ సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో రెండు నెలల పాటు సమ్మె గురించి విస్త్రుత ప్రచారం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర స్థాయిలో కార్మిక సంఘాల ర్యాలీలు, ప్రముఖ నగరాల్లో శ్రామికుల అవగాహన కార్యక్రమాలు, సమాజంలో అన్ని వర్గాలకు కార్మికుల హక్కుల గురించి స్పష్టమైన సందేశం ఇవ్వనున్నాయి. కార్మిక సంఘాల ప్రకారం మే 20 సమ్మె భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కార్మిక రైతాంగ పోరాటాలకు నాంది కావచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories