Bhajan Lal Sharma: రాజస్థాన్‌ సీఎంగా భజన్‌లాల్‌ శర్మ ప్రమాణ స్వీకారం

Bhajan Lal Sharma To Take Oath As Rajasthan Chief Minister
x

Bhajan Lal Sharma: రాజస్థాన్‌ సీఎంగా భజన్‌లాల్‌ శర్మ ప్రమాణ స్వీకారం

Highlights

Bhajan Lal Sharma: హాజరైన ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు

Bhajan Lal Sharma: రాజస్థాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌ శర్మ ప్రమాణస్వీకారం చేశారు. జైపూర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా.. భజన్‌లాల్‌తో ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్‌ చంద్‌ బైర్వాల ప్రమాణం చేశారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పలువురు నేతలు పాల్గొన్నారు. రాజస్థాన్‌ మాజీ సీఎం అశోక్‌ గెహ్లాత్‌ హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories