మెనూలో ఉల్లిదోశ మాయం

మెనూలో ఉల్లిదోశ మాయం
x
ఉల్లిపాయలు
Highlights

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేదంటారు. అలాంటింది ఇప్పుడు ఉల్లి పేరు ఎత్తితేనే జనం ఉలిక్కిపడుతున్నారు. ఏ వంటకైనా ఉల్లిపాయలు తప్పక వాడతాం అలాంటిది.

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేదంటారు. అలాంటింది ఇప్పుడు ఉల్లి పేరు ఎత్తితేనే జనం ఉలిక్కిపడుతున్నారు. ఏ వంటకైనా ఉల్లిపాయలు తప్పక వాడతాం అలాంటిది. దోశల్లో అయితే ఉల్లిదోశ అంటే మరి పడిచస్తాం. కాగా.. దేశంలో ఉల్లిరేటు ఆకాశాన్నినంటడంతో ఏ హోటల్లోనైనా ఉల్లిగడ్డలే కనిపించకుండా పోయింది. కొన్ని హోటల్లు ఉల్లిని బ్యాన్‌ చేశాయి. బెంగళూరులోని కొన్ని హోటల్లో మెనూలోనే ఉల్లిదోశ అనే పదం లేకుండా చేశారు. అంతేకాదు కొన్ని వంటల్లో ఉల్లిపాయలు వాడడం మానేశారు.

ఉల్లి ధరలు బాగా ఎక్కువగా ఉండడంతో మెనూలో ఉల్లి దోసెను తీసేశామని హోటల్ యజమాని ఒకరు తెలిపారు. అయితే ఉల్లి ధరలు పెరగడంతో వాటికి బదులు ఇతర టిఫిన్స్ రేట్లు పెంచాలని నిర్ణయించుకున్నాం, మధ్యతరగతి వాళ్లపై భారం పడుతుందని విరమించుకున్నామని తెలిపాడు. ఉల్లిపాయలు లేని వంటలు రుచిగా ఉండడం లేదని భోజన ప్రియులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఉల్లి ధరలు దిగివచ్చేలా చూడాలని కోరుతున్నామని కొందరు అంటున్నారు. కాగా అన్ని ఏపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉల్లిపాయను కిలో రూ.35కే అందించేలా చర్యలు చేపట్టాయి. బీహార్ లో అయితే ఉల్లిపాయలు ఏకంగా హెల్మెట్లు పెట్టుకుని అమ్ముతున్నారు. హెల్మ్‌ట్లు ఎందుకని అడిగితే ఉల్లిపాయలు ప్రజలు కొనేటప్పుడు ఆలస్యమైతే దాడులు చేసే అవకాశం ఉందని వారు తెలిపారు. గతంలో కూడా ఉల్లి ధరలు పెరిగినప్పటికీ కొద్దిరోజుల్లోనే దిగివచ్చాయి. కానీ ఈ సారి మాత్రం మూడు నెలల నుంచి ఉల్లి ధరలు పెరుగుతున్నాయి తప్ప దిగిరావడంలేదు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఉల్లి ధరలు చికిన్ ధర కంటే ఎక్కువగా ఉంన్నాయి. ఢిల్లీ అయితే ఏకంగా కిలో ఉల్లి రూ.500 వరకూ వెళ్లిందంటే మాములు విషయం కాదు. అందుకే చాలా హోటల్లలో ఉల్లిపాయలు వాడడం లేదు. పెద్ద పెద్ద హోటళ్లలో కూడా ఉల్లిపాయలు ఇవ్వడంలేదు. హైదరాబాద్ లాంటి కొన్ని నగరాల్లోని హోటళ్లలో ఆహారంలోకి ఉల్లిపాయలు కావాలంటే స్పేషల్ గా డబ్బులు చెల్లించాల్సిందే.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories