CEO Kills Son: కుమారుడిని చంపిన ప్రముఖ స్టార్టప్​ సంస్థ సీఈఓ- శరీరాన్ని బ్యాగ్​లో కుక్కి..!

Bengaluru CEO Kills Her 4 Year-Old Son In Goa Caught With Body In Bag
x

CEO Kills Son: కుమారుడిని చంపిన ప్రముఖ స్టార్టప్​ సంస్థ సీఈఓ- శరీరాన్ని బ్యాగ్​లో కుక్కి..!

Highlights

CEO Kills Son: సుచనా సేథ్‌ను అదుపులోకి తీసుకున్న చిత్రదుర్గ పోలీసులు

CEO Kills Son: గోవాలో ఓ స్టార్టప్ కంపెనీ సీఈవో దారుణానికి ఒడిగట్టింది. తన నాలుగేళ్ల కుమారుడిని చంపి.. మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని... గోవానుంచి కర్ణాటక వరకూ ట్యాక్సీలో ప్రయాణించింది. ట్యాక్సీ డ్రైవర్ సాయంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

బెంగళూరులోని ఓ స్టార్టప్ కంపెనీకి చెందిన సీఈవో సుచనా సేథ్ రెండు రోజుల క్రితం తన నాలుగేళ‌్ల కుమారుడితో గోవాలోని ఓ హోటల్‌లో దిగారు. సోమవారం హోటల్ గది ఖాళీ చేసి.. ట్యాక్సీలో వెళ్లిపోయింది. అయితే.. హోటల్ గది ఖాళీ చేసిన తర్వాత హోటల్ సిబ్బంది ఆమె గదిని శుభ్రం చేయడానికి వెళ్లగా.. గదిలో రక్తపుమరకలను గుర్తించారు. వెంటనే హోటల్ యాజమాన్యానికి తెలపడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. అయితే.. హోటల్‌ ఎంట్రీ సమయంలో సుచనా సేథ్‌తో పాటు నాలుగేళ‌్లు కుమారుడు ఉండగా.. వెళ్లిపోయేటప్పుడు ఒక్కరే వెళ్లడంతో.. అనుమానంతో.. చిన్నారి విషయంపై ట్యాక్సీ డ్రైవర్‌కు ఫోన్ చేసి ఆమెతో మాట్లాడారు. అయితే.. కుమారుడిని స్నేహితుడి ఇంటి దగ్గరే వదలివెళ్తున్నట్టు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది సుచనా సేథ్.

అప్పటికే పోలీసులు ఆ స్నేహితుడి అడ్రస్ తెలుసుకుని.. అక్కడి వెళ్లి చూడగా.. అది నకిలీ అడ్రస్ అని తేలింది. దీంతో పోలీసులకు అనుమానం మరింత ఎక్కువైంది. మరోసారి ట్యాక్సీ డ్రైవర్‌కు ఫోన్ చేసి... అనుమానం రాకుండా.. వెంటనే స్థానిక పోలీస్ ష్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. డ్రైవర్ నేరుగా కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా పోలీస్ స్టేషన్‌‌కు తీసుకెళ్లి అప్పగించారు. బ్యాగులో చిన్నారి మృతదేహం లభించడంతో.. సుచనా సేథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గలకారణాలపై ఆరా తీస్త్తున్నారు. దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories