Fact Check: మీడియాను తప్పుదారి పట్టించిన బీఎంటీసీ బస్సు కండక్టర్

Fact Check: మీడియాను తప్పుదారి పట్టించిన బీఎంటీసీ బస్సు కండక్టర్
x
Highlights

బీఎంటీసీ‌లో బస్సు కండక్టర్ ఎన్‌సీ మధు మీడియాను తప్పు దారి పట్టించినట్లుగా తెలుస్తోంది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మెయిన్స్ పరీక్షల్లో బీఎంటీసీ‌లో బస్సు కండక్టర్ ఎన్‌సీ మధు విజయం సాధించినట్లు వచ్చిన వార్తలు అన్ని తప్పుడు కథనాలు అని తెలుస్తోంది. మధు మీడియాను తప్పు దారి పట్టించినట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలోని మండ్య జిల్లాలో మలవల్లికి చెందిన ఎన్‌సీ మధు సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌లో ఉతీర్ణత సాధించినట్లుగా.. అతని గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది
. బస్సు కండక్టర్ చేసిన ప్రయత్నాలను నెటిజన్లు ప్రశంసించారు. కాగా.. ఈ వార్తలు అవాస్తవమని ఇప్పుడు తెలుస్తుంది.

బెంగళూర్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండీ శిఖా కూడా కష్టపడి చదువుకుని సివిల్స్ పాసయి ఆ స్థాయికి చేరుకున్నారు. ఆమెను స్ఫూర్తి గా తీసుకునే మధు సివిల్స్ రాయాలని అనుకున్నాడట. ఇక సివిల్స్‌కు సిద్ధం కావడంలో శిఖా అతనికి ఎంతగానో సహకరించారు. ప్రతివారం రెండు గంటల పాటు అతనికి సివిల్స్ పరీక్షలు ఎదుర్కోవడం కోసం సూచనలు అందించే వారు. అదేవిధంగా ఇప్పుడు ఇంటర్వ్యూను ఎదుర్కోవడానికి కూడా ఆమె సహకారాన్ని అందిస్తున్నారని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో షికారు చేశాయి.

ఇటీవల జనవరిలో యూపీఎస్సీ పరీక్షను విజయం సాధించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అతను మెయిన్స్ పరీక్షను క్లియర్ చేశాడని, మార్చి 25 వ తేదీ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నడని, అతను సంతోషం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. బీఎంటీసీ‌ మధు న్యూస్ ఐడి అవాస్తవం , అతని ఐఏఎస్ పరీక్షను క్లియర్ చేసినట్లు, ఐడీ మార్కులను తప్పుగా చూపించారని బీఎంటీసీ‌ తెలిపింది. కండక్టర్ తన ఫలితాలను ఎలా తప్పుగా చూపించాడో, ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు బిఎమ్‌టిసి అధికారులు తెలిపారు. మార్కులు తప్పుగా చూపించడమే కాకుండా మీడియాను తప్పుదారి పట్టించిన మధుపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో మధు ఆర్టికల్‌పై అనేక ట్విట్ చేస్తున్నారు. రోజుకు ఐదు గంటలు చదివితే కలెక్టర్ అవుతారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదీ పూర్తిగా తప్పుడు వార్తలు అని ట్వీట్ చేస్తున్నారు.

అప్పట్లో మధు కలెక్టర్ కాబోతున్నట్టు బెంగళూరు మీడియా కథనాల ఆధారంగా హెచ్ ఎం టీవీ లైవ్ కూడా కథనాన్ని ఇచ్చింది. అయితే, అది మధు తప్పుదోవ పట్టించడం వలన ఇచ్చినది తప్ప మరోటి కాదని తెలియచేస్తున్నాం. సాధారణంగా అందరిలానే మా రిపోర్టర్లు కూడా సాధారణ బస్సు కండక్టర్ మధు కలెక్టర్ కాబోతున్నారన్న వార్త యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఆతృతలో ప్రచురించడం జరిగింది. జరిగినదాన్లో పూర్తిస్థాయిలో మా తప్పు లేకున్నా, పొరపాటు వార్తాకథనాన్ని ప్రచురించినందుకు చింతిస్తున్నాం. సాధారణంగా వార్తలు ప్రచురించే సమయంలో అన్ని జాగ్రత్తలూ తీసివుంటాం. కానీ, ఇది స్ఫూర్తిదాయక కధనం కావడంతో పెద్దగా దానిపై దృష్టి సారించలేకపోయినందుకు చింతిస్తున్నాం. ఇకపై ఇటువంటివి జరగకుండా ఉండేలా చూసుకుంటామని హామీ ఇస్తున్నాం.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories