Viral Video: బెంగళూరులో బతకాలంటే హిందీ నేర్చుకోమని ఆటో డ్రైవర్ కి బెదిరింపు.. నెట్టింటా దుమారం రేపుతున్న వీడియో..

Viral Video
x

Viral Video: బెంగళూరులో బతకాలంటే హిందీ నేర్చుకోమని ఆటో డ్రైవర్ కి బెదిరింపు.. నెట్టింటా దుమారం రేపుతున్న వీడియో..

Highlights

Bengaluru Viral Video: దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ మాట్లాడడం చాలా తక్కువ. ఈ నేపథ్యంలో హిందీ పై ఏదో ఒక వార్త ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది.

Bengaluru Viral Video: బెంగళూరులో బతకాలంటే హిందీ నేర్చుకోవాలని ఒక ఆటో డ్రైవర్‌కు హిందీ అతను బెదిరించాడు. ఈ వీడియో నెట్టింటే వైరల్ అవుతుంది. అయితే బెంగళూరులోనే ఈ ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ మాట్లాడడం తక్కువగా ఉంటుంది. హిందీ వ్యతిరేకత కూడా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సోషల్‌ మీడియాలో భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. తీవ్రస్థాయిలో కన్నడ వాళ్ళు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటన ఎస్ఎంఎస్ ఆర్కే రోడ్డులో జరిగింది. బెంగళూరులో ఒక ఆటో డ్రైవర్‌తో ఒక వ్యక్తికి ఘర్షణ ఎందుకు జరిగిందో తెలియదు కానీ సదరు వ్యక్తి ఆటో డ్రైవర్‌ని బెంగళూరులో బతకాలంటే హిందీ నేర్చుకో హిందీ మాట్లాడు అని బెదిరించాడు. దానికి ఆటో డ్రైవర్ కూడా 'నేను హిందీ ఎందుకు నేర్చుకోవాలి?' నేను బెంగళూరులో ఉంటున్నాను నాకు కన్నడ వచ్చు.. నువ్వేంటి నాకు చెప్తున్నావు? అని బదులిచ్చాడు

సోషల్ మీడియాలో హిందీ వర్సెస్ కన్నడగా మారిపోయింది. ఆటో డ్రైవర్‌పై ఆ వ్యక్తి చాలా కోపంగా హిందీ నేర్చుకోమని బెదిరింపులకు గురి చేశాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో దీనిపై విభిన్నంగా కామెంట్స్ వస్తున్నాయి. బెంగళూరులో ఉండడానికి హిందీ ఎందుకు నేర్చుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆటో డ్రైవర్ కూడా సదరు వ్యక్తిని నువ్వు బెంగళూరులో ఉన్నావ్ కాబట్టి నువ్వు కన్నడ నేర్చుకో అని బదులిచ్చాడు

సోషల్ మీడియాలో @maheshpatil_B అనే ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో వేలాదిమంది వీక్షించారు. ఈ వీడియో పై కన్నడ వాసులు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడికి వచ్చి మమ్మల్ని హిందీ నేర్చుకోమని చెప్పడం ఏంటి? అంత బలుపు ఉంది. ఇక్కడ హిందీ నేర్పించడానికి వచ్చారా? అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories