కనికా కపూర్ స్టార్ లా కాకుండా రోగిలా ప్రవర్తించాలి : లక్నో ఆసుపత్రి

కనికా కపూర్ స్టార్ లా కాకుండా రోగిలా ప్రవర్తించాలి : లక్నో ఆసుపత్రి
x
singer kavika kapoor (file photo)
Highlights

కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షలు చేయించుకుని లక్నో ఆసుపత్రిలో చికిత్స పొందితోంది కనికా కపూర్.. ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆసుపత్రి...

కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షలు చేయించుకుని లక్నో ఆసుపత్రిలో చికిత్స పొందితోంది కనికా కపూర్.. ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆసుపత్రి వెల్లడించింది. అయితే కనికా కపూర్ ఒక సినీ స్టార్ గా కాకుండా రోగిలా ప్రవర్తించడం ప్రారంభించాలని కూడా పేర్కొంది. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిజిఐఎంఎస్) డైరెక్టర్ నుంచి ఈ ప్రకటన విడుదల చేశారు.

"కనికా కపూర్ కు ఆసుపత్రిలో సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స అందిస్తున్నాము. ఆమె రోగిగా సహకరించాలి.. ఒక స్టార్ లా బెహేవ్ చెయ్యకుండా ఉంటే బెటర్" అని ఆసుపత్రి డైరెక్టర్ ఆర్కే ధీమాన్ అన్నారు. కనికా కపూర్ "తనకు తానుగా సహాయపడటానికి" ఆసుపత్రికి సహకరించాలి అని ఆయన పేర్కొన్నారు.

"ఆమెకు హాస్పిటల్ లో కిచెన్ నుండి గ్లూటెన్ ఫ్రీ డైట్ అందించబడుతోంది. ఆమెకు సపరేట్ గా అందించిన సౌకర్యం టాయిలెట్, పేషెంట్-బెడ్ మరియు టెలివిజన్‌తో కూడినవి ఉన్నాయి. ఆమె గది యొక్క వెంటిలేషన్ ప్రత్యేక ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్‌తో ఎయిర్ కండిషన్ చేయబడింది అని అన్నారు. సింగర్ కనికా కపూర్ దేశంలో కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షించిన మొదటి బాలీవుడ్ ప్రముఖురాలు. మార్చి మధ్యలో యునైటెడ్ కింగ్‌డమ్ (లండన్) నుంచి ఆమె లక్నోలో అడుగుపెట్టినట్లు వార్తలు వచ్చాయి.

కనికా కపూర్ కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలిన తరువాత బిజెపి ఎంపి మరియు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్ళారు. లక్నోలో జరిగిన పార్టీలో కనిక కపూర్‌ను ఆయన కలిశారు.

కనికా కపూర్ పార్టీలో వసుంధర రాజే వంటి ప్రముఖ రాజకీయ నాయకుల తోపాటు పార్లమెంటు సభ్యులైన అనుప్రియా పటేల్ లతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పరిచయం ఏర్పడింది, ముందు జాగ్రత్త చర్యగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అయితే విదేశాల నుంచి వచ్చి సమాచారం ఇవ్వనందుకు గాను ఆమెపై పోలీస్ కేసు నమోదయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories