అమ్మకానికి ఆక్సిజన్.. ఎక్కడో తెలుసా ?

Oxy Pure
x
Oxy Pure
Highlights

ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో ఆక్సిప్యూర్ అనే బార్ గాలిని అమ్మకానికి పెట్టింది. 15నిమిషాలకు రూ.299లకు అక్సిప్యూర్ అమ్ముతున్నట్లు బార్ నిర్వహకులు తెలిపారు.

ఢిల్లీలో వాయు కాలుష‌్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. అయితే అక్కడ దీపావళి తర్వాత కాలుష్యం మరింత త్రీవ స్థాయికి చేరిన విషయం తెలిసిందే. వాయు కాలుష‌్యం నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏమాత్రం సత్ఫలితాలను ఇవ్వడంలేదు. వాయు కలుష్యం బారి నుంచి స్వచ్చమైన గాలి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.

దీనిని అదునుగా తీసుకొని ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో ఆక్సిప్యూర్ అనే బార్ గాలిని అమ్మకానికి పెట్టింది. 15నిమిషాలకు రూ.299లకు అక్సిప్యూర్ అమ్ముతున్నట్లు బార్ నిర్వహకులు తెలిపారు. ఆక్సి్ప్యూర్ ప్రతినిధి బోన్ని ఐరెన్ బామ్ మాట్లాడుతూ.. తాము వివిధ రకాల పరిమళాలలో పదిహేను నిమిషాల పాటు అదుపుచేస్తూ స్వచ్చమైన గాలిని అదిస్తున్నామని తెలిపారు. దానికి లెమన్ గ్రాస్, దాల్చిన చెక్క, పుదీనా, లావెండర్, వెనీలా, యూకలిప్టస్, బాదం, చెర్రీ గార్డెనియాస్ వంటి వివిధ రకాల పరిమళాల్లో ఆక్సిజన్ అందిస్తున్నామని తెలిపారు. దీని 15 నిమిషాల పాటు పీడనాన్ని అదుపుచేయగలమని ఒక మనిషి మాత్రమే పీల్చుకోగలరని వివరించారు. ఇది పీల్చుకోవడం వలన మంచి నిద్ర పడుతోందని, ఒత్తిడి దరిచేరదని బోన్ని ఐరెన్ బామ్ వెల్లడించారు.

ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం ద్విచక్ర వాహనాలకు మినహా ఇతర వాహనాలకు సరి బేసి విధానాన్ని అమలు చేసింది. అయితే ఈ విధానంలో సీఎంతో సహా కేబినెట్ మంత్రులకు వర్తిస్తుంది. కోర్టు కూడా ఈ విషయాన్ని సిరీయస్ గా తీసుకుంద. ఢిల్లీ చూట్టుపక్కట రాష్ట్రాల వారు చెత్త కాల్చడం కొద్ది రోజులు తగ్గించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ వాయు కాలుష్యం ఒక ఢిల్లీనే కాదు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను వణికిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories