అలర్ట్... నాలుగు రోజులు బ్యాంక్‌ల మూత.!

అలర్ట్... నాలుగు రోజులు బ్యాంక్‌ల మూత.!
x
Highlights

తెలుగు సంవత్సరాది పండగ ఉగాది, ఉద్యోగుల సమ్మె, సాధారణ సెలవుల నేపథ్యంలో ఈ నెల ఆఖరులో వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంకుల కార్యాలయాలు మూత పడనున్నాయి.

తెలుగు సంవత్సరాది పండగ ఉగాది, ఉద్యోగుల సమ్మె, సాధారణ సెలవుల నేపథ్యంలో ఈ నెల ఆఖరులో వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంకుల కార్యాలయాలు మూత పడనున్నాయి. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా బ్యాంకు యూనియన్ల సమ్మె బాట పట్టనున్నాయి. దీంతో వరుసగా సెలవులు రాబోతున్నాయి.. ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని బ్యాంకు కస్టమర్లు అలెర్ట్ గా ఉండాలని వివిధ బ్యాంకుల సూచిస్తున్నాయి. బ్యాంకు లావాదేవీలకు సంబందించిన ముఖ్యమైన పనులను ఈలోపే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఒకవేళ సెలవు దినాల్లోనే పనులు చేసుకోవాలి అనుకుంటే ఈనెల 24 లోపే చేసుకోవాలని సూచించారు. ఈ నెల 25న ఉగాది పండుగ సందర్బంగా సెలవు, మరుసటి రోజు గురువారం బ్యాంకులు పనిచేసినా... బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు.. ఇక 27న బ్యాంకు యూనియన్ల సమ్మె ప్రకటించాయి, 28వ తారీకు నాలుగవ శనివారం, 29న ఆదివారం సాధారణ సెలవు. కావున బ్యాంకులు తిరిగి 30వ తారీకు సోమవారం యధావిధిగా నడుస్తాయని సమాచారం.

నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్న నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏటీఎం యంత్రాల్లో భారీగా నగదును లోడ్ చేస్తున్నారు. అయితే బ్యాంకు అధికారులు మాత్రం ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలను వీలైతే ఈలోపే పూర్తి చేసుకోవాలని లేదా వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories