RBI: ఏటీఎంలలో నగదు లేకపోతే బ్యాంకులకు జరిమానా

Banks Fined for Not Having Cash in ATM
x

ఎటిఎం (ఫైల్ ఇమేజ్)

Highlights

RBI: రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం * అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్న నిబంధన

RBI: గల్లీకో మూడు, నాలుగు ఏటీఎంలు ఒక్కోసారి ఒక్కదాంట్లో డబ్బులు ఉండవు. నో క్యాష్ అని మేసేజ్ స్క్రీన్ పై కనిపిస్తోంది. చేసేదేమి లేక మరో చోటకు వెళ్లిపోతాం. ఇకపై అలా ఉండదు. క్యాష్ లేకపోతే బ్యాంకుల పనిపడతమంటోంది ఆర్బీఐ. ఏటీఎం మెషీన్లలో డబ్బులు లేకపోతే 10 వేలు జరిమానా తప్పదని హెచ్చిరిస్తోంది.

ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ యంత్రాల్లో నగదు అందుబాటులో లేని సమయం నెలకు 10 గంటలు దాటితే బ్యాంకులకు 10 వేల చొప్పున జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి తాజా నిబంధన అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏటీఎంలు ఖాళీ అయిన వెంటనే బ్యాంకులు తిరిగి డబ్బు నింపకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తమ దృష్టికి వచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

ఈ నేపథ్యంలో వాటిలో నోట్ల లభ్యతను పర్యవేక్షించే వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిందిగా బ్యాంకులు, వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్లను ఆదేశించినట్లు పేర్కొంది. డబ్ల్యూఎల్‌ఏల్లో నగదు అందుబాటులో లేకపోతే.. వాటికి డబ్బు అందజేసే బాధ్యతను కలిగి ఉన్న బ్యాంకులకు జరిమానా విధిస్తామని తెలిపింది.


Show Full Article
Print Article
Next Story
More Stories