Coronavirus : కరన్సీ వద్దు..డిజిటల్ సేవలు ముద్దు అంటున్న బ్యాంకులు!

Coronavirus : కరన్సీ వద్దు..డిజిటల్ సేవలు ముద్దు అంటున్న బ్యాంకులు!
x
Highlights

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కస్టమర్లకు అందించే బ్యాంకింగ్ సర్వీసులకు అంతరాయం లేకుండా చూస్తామని భరోసా ఇచ్చింది.

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కస్టమర్లకు అందించే బ్యాంకింగ్ సర్వీసులకు అంతరాయం లేకుండా చూస్తామని భరోసా ఇచ్చింది.అయితే అవసరం ఉంటే తప్ప బ్యాంకులకు వినియోగదారులు రావొద్దని విజ్ఞప్తి చేసింది. కాగా కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా దేశంలోని పలు బ్యాంకులు ఉద్యోగులకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా వినియోగదారులకు కూడా కొన్ని సూచనలు చేసింది. ఐబీఏ.

వినియోగదారులు బ్యాంకుల్లో కరెన్సీని తాకిన లేదా లెక్కించిన తర్వాత చేతులు కడుక్కోవాలని విజ్ఞప్తి చేసింది. వినియోగదారులు తమ లావాదేవీలు కోసం ఆన్‌లైన్ మరియు మొబైల్ బ్యాంకింగ్ వంటి విధానాలను ఉపయోగించాలని మరియు బ్యాంకుల ఫ్రంట్ డెస్క్ సిబ్బందికి ప్రమాదం కలిగించే విధంగా బ్యాంక్ శాఖలను సందర్శించకుండా ఉండాలని ఐబిఎ వినియోగదారులను కోరింది.

ఫిజికల్ బ్యాంకింగ్ / కరెన్సీ లెక్కింపు / AEPS (ఆధార్-ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్) లావాదేవీలకు ముందు, ఆ తరువాత కనీసం 20 సెకన్ల పాటు వినియోగదారులు తమ చేతులను సబ్బుతో కడగాలి అని ప్రజా విజ్ఞప్తిలో ఐబిఎ తెలిపింది. ఈ సందర్బంగా బ్యాంకింగ్ అసోసియేషన్ 'కరోనా సే దారో నా, డిజిటల్ కరో నా' అనే ప్రచారాన్ని ప్రారంభించింది. కరెన్సీకి బదులుగా చెల్లింపులు చేయడానికి క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించమని ప్రజలను ప్రోత్సాహిస్తోంది.

అలాగే ఐబిఎ మరియు దాని సభ్య బ్యాంకులన్నీ నిరంతరాయంగా బ్యాంకింగ్ సేవలను అందిస్తాయని భరోసా ఇచ్చి, సంపూర్ణ అవసరాల విషయంలో మాత్రమే బ్రాంచ్ ప్రాంగణాలను సందర్శించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. మార్చి 23 నుంచి అన్ని బ్యాంకులు కొన్ని సర్వీసులను కచ్చితంగా కస్టమర్లకు అందుబాటులో ఉంచుతామని ఐబీఏ తెలిపింది.

క్యాష్ డిపాజిట్లు, క్యాష్ విత్‌డ్రాయెల్స్, చెక్ క్లియరెన్స్, రెమిటెన్స్‌లు, గవర్నమెంట్ ట్రాన్సాక్షన్లు వంటి సేవలు తప్పక అందుబాటులో ఉంటాయని తెలిపిన ఐబిఎ నాన్ ఎసెన్షియల్ సర్వీసులు అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొంది. ఇక ఉద్యోగులు అందరూ కూడా సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్నట్టుగానే సవాళ్లను ఎదుర్కొంటున్నారు, అందువల్ల మాకు కూడా ప్రజల నుంచి సహాయం కావాలని అడుగుతున్నట్టు ఐబీఏ కోరింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories