ఖాతాదారులకు ఊరట.. బ్యాంకుల సమ్మె వాయిదా

ఖాతాదారులకు ఊరట.. బ్యాంకుల సమ్మె వాయిదా
x
Highlights

మార్చి 11 నుంచి తలపెట్టిన మూడు రోజుల బ్యాంకుల సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు యూనియన్లు ప్రకటించాయి.

మార్చి 11 నుంచి తలపెట్టిన మూడు రోజుల బ్యాంకుల సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు యూనియన్లు ప్రకటించాయి. ముంబైలో శనివారం భారత బ్యాంకుల

సంస్థ( ఐబిఎ) తో జరిగిన సమావేశంలో సానుకూల పురోగతి ఉన్నందున సమ్మెను వాయిదా వేసే నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలిపింది. ఇటీవల యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ , బ్యాంకింగ్ రంగ ఉద్యోగుల సంస్థల బృందం సమ్మెకు పిలుపునిచ్చింది.

ముంబైలో వివిధ ఉద్యోగుల సంస్థలు ఐబిఎతో సమావేశమయ్యాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో, వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాల తోపాటు, జీతం 15 శాతం పెంచడం వంటి అంశాలపై చర్చించారు. పనితీరు బాగున్న బ్యాంకుల్లో నిర్వహణ లాభాల్లో నాలుగు శాతాన్ని ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఇచ్చేందుకు అంగీకరించడం తోపాటు వివిధ సంస్థలు లేవనెత్తిన సమస్యలపై చర్చించడానికి ఐబిఎ అంగీకరించింది.

దీంతో సమ్మె వాయిదా పడింది. కాగా 15 శాతం వేతన పెంపుతో బ్యాంకులపై ఏడాదికి సుమారు రూ.8,000 కోట్ల భారం పడనుంది. అలాగే రూ.80,000 జీతం ఉన్న బ్యాంకు ఉద్యోగికి ఏడాదికి రూ.40 నుంచి రూ.50 వేల లాభం చేకూరనుందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి వేతన సవరణ కోసం జనవరి 31 , ఫిబ్రవరి 1 తేదీల్లో సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే.

వేతన సవరణ మరియు ఇతర డిమాండ్లపై నిరసనగా మార్చి 11 నుండి మూడు రోజుల సమ్మెకు వెళ్తామని బ్యాంక్ యూనియన్లు ప్రకటించాయి. సమ్మె మార్చిలో ఒక వారం పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలపై పెద్ద ప్రభావాన్ని చూపే విధంగా పరిస్థితి తయారైంది. దాంతో బ్యాంకు ఖాతాదారులు టెన్షన్ పడ్డారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్, పైగా ఆర్ధిక సంవత్సరం ముగింపు కావడంతో సమ్మె జరిగి ఉంటే పరిస్థితి ఆందోళన కరంగా మారేదని నిపుణులు అంచనా వేశారు. కానీ అనూహ్యంగా బ్యాంకులు తమ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించే విధంగా పరిణామాలు చోటుచేసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలావుంటే మార్చి 10 న హోలీ సెలవుదినం కాకుండా, బ్యాంకింగ్ కార్యకలాపాలు ఈ నెల రెండవ శనివారం (మార్చి 15) మూసి వేయబడతాయని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories