ఇవాల్టినుంచి బ్యాంకులు బంద్!

ఇవాల్టినుంచి బ్యాంకులు బంద్!
x
Highlights

బ్యాంక్ యూనియన్లు నేడు ( జనవరి 31 ) , రేపు ( ఫిబ్రవరి 1 )న సమ్మెకు దిగాయి. దీంతో ఈ రెండు రోజుల తోపాటు ఆదివారం సాధారణ సెలవు కారణంగా మొత్తం మూడు రోజుల...

బ్యాంక్ యూనియన్లు నేడు ( జనవరి 31 ) , రేపు ( ఫిబ్రవరి 1 )న సమ్మెకు దిగాయి. దీంతో ఈ రెండు రోజుల తోపాటు ఆదివారం సాధారణ సెలవు కారణంగా మొత్తం మూడు రోజుల పాటు బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. 2017 నుంచి జీతాల పెంపు కోసం బ్యాంక్ యూనియన్లు పలుమార్లు సమ్మెకు దిగాయి. జీతాల పెంపునకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించడం లేదు. ఇటీవలనే ఐబీఏ, బ్యాంక్ యూనియన్ల మధ్య చర్చలు జరిగాయి. వేతనాలను 20 శాతం పెంచాలని యూనియన్లు డిమాండ్‌ చేస్తుండగా.. ఐపీఏ మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదు. చర్చలు విఫలం కావడంతో యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి.

సమ్మెకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల యూనిట్‌ కూడా మద్దతు తెలిపింది. దేశవ్యాప్తంగా 10 వేల శాఖలతో పని చేస్తున్న పబ్లిక్‌, ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంక్స్‌తో పాటు ఫారిన్‌ బ్యాంక్‌ ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నట్టు సమాచారం. ఈ రెండు రోజుల్లో ప్రభుత్వం దిగిరావాలని లేదంటే సమ్మెను ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కాగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూత పడనుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అయితే ప్రైవేట్‌ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు మాత్రం యథాతథంగా పనిచేయనున్నాయి.

గురువారం నాటికే బ్యాంకులు వాటి కస్టమర్లకు సమ్మె గురించి ముందస్తు సమాచారం పంపాయి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) కూడా స్ట్రైక్ నేపథ్యంలో సర్వీసులపై ప్రభావం ఉండొచ్చని అంచనా వేసింది.

ఇదిలావుంటే నేటినుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజునే బ్యాంక్ యూనియన్లు సమ్మెకు దిగడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 న బడ్జెట్ 2020 ను ప్రవేశపెట్టబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో సారి వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories