Sheikh Hasina: భారత్ పర్యటనలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

Bangladesh Prime Minister Sheikh Hasina Visit to India
x

భారత్ పర్యటనలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

Highlights

Sheikh Hasina: ఢిల్లీలో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు

Sheikh Hasina: బంగ్లాదేశ్ ఎగుమతులకు భారత్ అతిపెద్ద విపణిగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత పర్యటనలోఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాల బలోపేతంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇది ఇరుదేశాల ప్రజల మధ్య సహకారానికి సంబంధించిన విషయం అని, ఇది నిరంతరం పురోగమిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య పురోగతిని మరింత ముందుకు తీసుకెళతామన్నారు. ఈ మేరకు ద్యైపాక్షిక సమగ్ర ఆర్థిక ఒప్పందం కుదుర్చుకునేందుకు త్వరలోనే చర్చలు జరుపుతామన్నారు. రానున్న రోజుల్లో భారత్-బంగ్లాదేశ్ మైత్రి మరింత ఉన్నతస్థాయికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

అనంతరం బంగ్లా ప్రధాని షేక్ హసీనా మాట్లాడుతూ... భారత్, బంగ్లాదేశ్ ఐటీ, అంతరిక్ష పరిశోధనలు, అణు శక్తి విభాగంలోనూ పరస్పర సహకారం కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు. ఇవాళ జరిగిన సమావేశంలో కుషియారా నదీ జలాల పంపకంపైనా ఒప్పందం చేసుకున్నామని వివరించారు. ఈ సమావేశంలో జలవనరుల పంపకానికి సంబంధించి ఒప్పందాలపైనా నేతలు సంతకాలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories