నేడు తలుపులు తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆలయం

Badrinath temple to open Today
x

నేడు తలుపులు తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆలయం

Highlights

Badrinath: ఆరు నెలల విరామం తర్వాత తెరుచుకుంటున్న తలుపులు

Badrinath: ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయం తలుపులు మరికాసేపట్లో తెరుచుకోనున్నాయి. ఉత్తరాఖండ్ లోని నాలుగు ధామ్ లలో శ్రీకేదార్ నాథ్, శ్రీ గంగోత్రి, శ్ర యమునోత్రి ధామ్ ల తలుపులు అక్షయ తృతియ రోజునే తెరుచుకున్నాయి. భద్రీనాథ్ ఆలయాన్ని పూలతో అలంకరించారు. హిందూవులు సందర్శించే తీర్ధయాత్రల్లో బద్రీనాథ్ యాత్ర ఒకటి. ఇది ప్రధానంగా విష్ణు భక్తులచే నిర్వహించబడుతుంది. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో భద్రీనాథ్ ప్రముఖ పట్టణం.

సముద్రమట్టానికి మూడు వేల 133 మీటర్ల ఎత్తులో భద్రీనాథ్ ఆలయం ఉంది. ఇక్కడ తీర్ధయాత్ర సాధారణంగా ఏప్రిల్ చివరలో లేదా మే నెల ప్రారంభలో మొదలవుతుంది. నవంబర్ వరకు కొనసాగుతుంది. ఇప్పటికే చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయ్యింది. రెండు రోజుల క్రితం కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి సహా మూడు ధామ్ లు సందడిగా మారాయి. తొలిరోజు ఒక్క భారత దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి రికార్డు స్తాయిలో కేదార్ నాథ్ ధామ్ ను సందర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories