బాబ్రీ కూల్చివేత కేసు.. సెప్టెంబర్ 30న తీర్పు..

బాబ్రీ కూల్చివేత కేసు.. సెప్టెంబర్ 30న తీర్పు..
x
Highlights

దశాబ్దాల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో త్వరలో తీర్పు వెలువడనుంది. సిబిఐ ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 30న తీర్పు వెలువరించనుంది, ఇందులో 32 మంది ..

దశాబ్దాల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో త్వరలో తీర్పు వెలువడనుంది. సిబిఐ ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 30న తీర్పు వెలువరించనుంది, ఇందులో 32 మంది నిందితుల్లో మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ, బిజెపి నాయకులు మురళి మనోహర్ జోషి, కల్యాణ్ సింగ్, ఉమా భారతి ఉన్నారు. తీర్పు తేదీని లక్నోలోని సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ బుధవారం నిర్ణయించారు. ఈ నెల ప్రారంభంలో, మొత్తం 32 మంది నిందితుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది సిబిఐ కోర్ట్.

ఈ 32 మంది నిందితుల్లో 25 మంది తరఫున ప్రముఖ న్యాయవాది కెకె మిశ్రా వాదనలు వినిపించారు. కాగా జస్టిస్ రోహిన్టన్ ఫాలి నారిమన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈనెల 19న జారీ చేసిన ఉత్తర్వులలో.. బాబ్రీ కేసులో తీర్పును సెప్టెంబర్ 30 వరకూ వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. ఇదిలావుంటే బాబ్రీ స్థలంలో పురాతన రామాలయం ఉదంటూ 'కరసేవకులు' 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఆ సమయంలో ఎల్.కె.అద్వానీ, ఎం.ఎం.జోషి, కల్యాణ్ సింగ్, ఉమా భారతిలు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories