Babri Masjid Demolition Case: బాబ్రి కేసులో చివరి అడుగులు.. సెప్టెంబరు నెలాఖరుకల్లా తేల్చాలని సుప్రీం ఆదేశం

Babri Masjid Demolition Case: బాబ్రి కేసులో చివరి అడుగులు.. సెప్టెంబరు నెలాఖరుకల్లా తేల్చాలని సుప్రీం ఆదేశం
x
Highlights

Babri Masjid Demolition Case: బాబ్రి మసీదు కేసును వచ్చే నెలాఖరుకల్లా పూర్తిచేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

Babri Masjid Demolition Case: బాబ్రి మసీదు కేసును వచ్చే నెలాఖరుకల్లా పూర్తిచేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఒక వైపు రామాలయ నిర్మాణం ముమ్మరంగా జరుగుతున్న వేళ సుప్రీం ఇటువంటి ఆదేశాలివ్వడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. హిందూవులు చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి ఓ వైపు అడుగులు పడుతున్న వేళ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును సెప్టెంబర్‌ 30లోపు పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని దేశ అత్యున్నత న్యాయస్థానం శనివారం ఆదేశించింది.

విచారణ పూర్తి చేసి తుది తీర్పును కూడా వెలువరించాలని కోర్టు స్పష్టం చేసింది. కాగా గత ఏడాది ఇచ్చిన ఆగస్ట్‌ 31 వరకు గడువు ముగిస్తున్న నేపథ్యంలో సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దీనికి సమ్మతించిన న్యాయస్థానం విచారణ గడువును మరో నెలపాటు పొడిగించింది. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కురు వృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ (92), అశోక్‌ సింఘాల్‌, మురళీ మనోహర్‌ జోషీ, ఉమాభారతి, వినయ్‌ కటియార్‌, గిరిరాజ్‌ కిషోర్‌, నాటి యూపీ సీఎం కళ్యాణ్‌సింగ్‌లకు కొంత ఊరట లభించింది.

కరసేవకులను రెచ్చగొట్టి కుట్రపూరితంగానే మసీదును కూల్చివేశారని (కుట్ర) ఆరోపణలు వీరు ఎదుర్కొంటున్నారు. దాదాపు 29 ఏళ్ల నుంచి కోర్టుల్లో విచారణ సాగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీలతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొంత మంది వాగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. సుప్రీంకోర్టు తాజా ఉత్వర్వులతో విచారణ మరికొంత వేగంగా ముందుకు సాగనుంది. మరోవైపు 1992 నాటి బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితులుగా ఉన్న అద్వానీ.. ఆ కేసు నుంచి బయటపడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

సీబీఐ కేసులో బీజేపీ అగ్రనేతలు..

1992 డిసెంబర్‌ 6న సాయంత్రం (బాబ్రీ మసీదు కూల్చివేత) స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో 198/92 నెంబర్‌తో మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. వీరిలో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, అశోక్‌ సింఘాల్‌, మురళీ మనోహర్‌ జోషీ, ఉమాభారతి, వినయ్‌ కటియార్‌, గిరిరాజ్‌ కిషోర్‌, నాటి యూపీ సీఎం కళ్యాణ్‌సింగ్‌ కూడా ఉన్నారు. అయితే 2003 సెప్టెంబర్‌ 19న రాయ్‌బరేలీలోని స్పెషల్‌ మెడిస్ట్రేట్‌ అద్వానీ, జోషీలకు విచారణ నుంచి విముక్తి కల్పించింది. అయితే దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2017లో తీర్పును వెలువరిస్తూ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్వానీ, జోషీ, ఉప భారతి, కళ్యాణ్‌ సింగ్‌లను కూడా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో​ సీబీఐ వీరందరినీ విచారిస్తోంది. కేసు విచారణ తుది దశతో ఉన్న నేపథ్యంలో.. నేరం రుజువైతే శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. తాజా ఆదేశాల ప్రకారం సెప్టెంబర్‌ 30న తుది తీర్పు వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories