Ayodhya Deepotsav: 51 ఘాట్‌లలో 24 లక్షల దీపాలు.. ప్రపంచ రికార్డుకు సిద్ధమైన అయోధ్య

Ayodhya Ready For World Record With Deepotsav Festival
x

Ayodhya Deepotsav: 51 ఘాట్‌లలో 24 లక్షల దీపాలు.. ప్రపంచ రికార్డుకు సిద్ధమైన అయోధ్య

Highlights

Ayodhya Deepotsav: సరయూ నదీతీరంలో అంగరంగ వైభవంగా ‘దీపోత్సవ్‌’

Ayodhya Deepotsav: లక్షలాది దీపాల వెలుగులతో అయోధ్య నగరి ధగధగలాడనుంది. సరయూ నదీ తీరంలో 24 లక్షల దివ్వెలతో అంగరంగ వైభవంగా ‘దీపోత్సవ్‌’ను నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నదీ తీరంలో సరయూ హారతి నిర్వహించారు. తర్వాత నది ఒడ్డున ‘దీపోత్సవ్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు. అయోధ్య నగరమంతా దీపాల కాంతులతో కొత్త శోభ సంతరించుకుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేసేందుకు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో దాదాపు 25వేల మంది వాలంటీర్లు 24లక్షల దీపాలను వెలిగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories