అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు..ముస్లింలకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి ఇవ్వాలని అదేశం

అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు..ముస్లింలకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి ఇవ్వాలని అదేశం
x
Highlights

సుప్రీంలో అయోధ్యపై తుది తీర్పు వెలువడింది. ముస్లింలకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి ఇవ్వాలని సుప్రీం కోర్టు తెలిపింది. తీర్పుపై ఐదుగురు జడ్జీల...

సుప్రీంలో అయోధ్యపై తుది తీర్పు వెలువడింది. ముస్లింలకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి ఇవ్వాలని సుప్రీం కోర్టు తెలిపింది. తీర్పుపై ఐదుగురు జడ్జీల ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. షియా వక్ఫ్ బోర్డు స్పెషల్ లీవ్ పిటిషన్, అలాగే వివాదాస్పద భూమి తమదేనంటూ దాఖలైన పిటిషన్, నిర్మొహి అఖాడా పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. రాజకీయాలు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలని సీజేఐ తెలిపారు. అయోధ్య కేసుపై ఐదుగురు న్యాయమూర్తుల ఏక్రగీవ తీర్పు వెలువరించారు. ప్రార్థనామందిరాల చట్టం ప్రాథమిక విలువలు, మతసామరస్యాన్ని పరిరక్షిస్తుందన్నారు. ఇది పెద్ద సంఖ్యలో ఉన్న హిందూ భక్తుల కోసం ఉద్దేశించిందన్నారు సీజేఐ. ఇది వ్యక్తిగత హక్కుల కోసం దాఖలు చేసిన వ్యాజ్యం కాదని తెలిపారు. బాబ్రీ మసీదును ఖచ్చితంగా ఎప్పుడు నిర్మించారో ప్రాతిపదిక లేదని తెలిపారు. బాబర్ కాలంలో బాబ్రీ మసీదు నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. ఇక మత గ్రంథాలను బట్టి కోర్టు తీర్పు ఉండదని తేల్చేశారు. పురావస్తు శాఖ అధ్యయనాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదును కట్టలేదన్న సీజేఐ బాబ్రీ మసీదుకు ముందు ఇస్లామిక్ నిర్మాణాలేవి లేవని తెలిపారు.

మసీదు నిర్మాణం కోసం వేరే స్థలం కేటాయించాలి సుప్రీంకోర్టు తెలిపింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రస్తకే లేదని స్పష్టం చేసింది. అయోధ్య యాక్ట్ కింద మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని వివాదాస్పద స్థలాన్ని అయోధ్య ట్రస్ట్‌కు కేటాయించాలని‌ సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీం తెలిపింది. 2.77 ఎకరాల భూమిని అయోధ్య ట్రస్ట్‌కు ఇచ్చి ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వాలని కోర్టు తెలిపింది. 1993 ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకు స్థలమివ్వొచ్చని సుప్రీం స్పష్టం చేసింది. దేవాలయాన్ని ధ్వంసం చేశారడానికి పురావస్తు ఆధారాల్లేవని 12-16 శతాబ్దాల మధ్య అక్కడేముందో చెప్పడానికి కూడా పురావస్తు ఆధారాల్లేవు అని సీజే తెలిపారు.

అయోధ్యను హిందువులు రామజన్మభూమిగా భావిస్తారని ప్రధానమైన డోమ్ కింద రాముడి జన్మస్థానం ఉందని నమ్ముతారని సీజే తెలిపారు. ఈ భావనలో ఎలాంటి వివాదానికి తావు లేదన్నారు. హిందువుల నమ్మకం నిజమైనది కాదనడానికి ఆధారాల్లేవన్నారు. ఈ నమ్మకానికి విలువ ఉందా లేదా అని తేల్చడం కోర్టు పరిధిలో లేదన్నారు. మసీదును ముస్లింలు ఎప్పుడూ వదిలేయలేదని ముస్లింలకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి ఇవ్వండని ఆదేశించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories