పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో దారుణం

Atrocity in Pathankot District of Punjab
x

పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో దారుణం 

Highlights

Punjab: భార్యను విచక్షణా రహితంగా కొట్టిన భర్త

Punjab: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యపై ఉన్న కోపంతో ఆమెను చితకబాదాడు. తన తల్లితో కలిసి భార్యను విచక్షణా రహితంగా కొట్టడంతో బాధితురాలు సృహ తప్పి పడిపోయింది. భార్యను గొడ్డును బాధినట్లు కొడుతుండగా..బాధితురాలి సోదరి అడ్డురాగా ఆమెను కూడా కిరాతకుడు చితక్కొట్టాడు. భార్యను కొడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు..నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నిందితుడి తల్లిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories