సోలాపూర్‌లో బంపర్ ఆఫర్.. రూపాయికే లీటర్ పెట్రోల్

At a Petrol Bunk in Solapur Petrol Offer for Rs.1
x

సోలాపూర్‌లో బంపర్ ఆఫర్.. రూపాయికే లీటర్ పెట్రోల్

Highlights

Solapur: 500 మందికి అందించిన బంక్ యజమాని

Solapur: ఆకాశానికి అంటిన పెట్రోల్ , డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామన్న ప్రకటనతో వందలాది మంది వాహనదారులు పెట్రోల్ బంక్‌కు క్యూ కట్టారు. గురువారం బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా సోలాపూర్‌లోని ఓ పెట్రోల్‌ బంక్‌ ఓనర్‌ రూపాయికే లీటర్‌ పెట్రోల్‌ అని 500 మందికి పెట్రోల్​ ఇచ్చారు. ఆఫర్‌ విషయం తెలుసుకున్న వాహనదారులు బంక్‌ వద్ద క్యూ కట్టారు. భారీ సంఖ్యలో వచ్చిన వాహనదారులకు కట్టడి చేసేందుకు చివరకు పోలీసులు రంగంలోకి దిగారు. భారమైన పెట్రో ధరల్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోడీకి సందేశం ఇచ్చేందుకే ఇలా చేసినట్లు బంక్ యజమాని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories