Assam CM: అస్సాం సీఎం హత్యకు కుట్ర

Police have Cracked a Conspiracy to Assassinate Assam CM Himanta Biswa Sarma
x

 అసోం సీఎం హత్యకు కుట్ర (ఫైల్ ఫోటో)

Highlights

*ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్యకు కుట్ర *తుపాకి, మూడు బుల్లెట్లు ఇచ్చిన వైనం

Assam CM: అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ హత్యకు జరిగిన కుట్రను పోలీసులు ఛేదించారు. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన దుండగులు అతడికి తుపాకి ఇచ్చి సీఎంను హత్య చేయాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. దీంతో బెదిరిపోయిన ఆ సదరు వ్యక్తి తనను రక్షించాలంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.

అసోంలోని లఖింపూర్‌ జిల్లాకు చెందిన శరత్‌దాస్‌ ఈ వీడియోను షేర్ చేశారు. దీని ప్రకారం తాను నాగాలాండ్ నుంచి ఈ వీడియో చేస్తున్నానని, ఈనెల 9న కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తనను కొందరు కిడ్నాప్‌ చేసి, ఓ తుపాకి, మూడు బుల్లెట్లు చేతికి అందించి, హిమంత బిశ్వశర్మ ను చంపాలని ఒత్తిడి చేశారని, ఇక ఈ విషయాన్ని బయటకు చెబితే తనను చంపేస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు.

తన డాక్యుమెంట్లతో పాటు 3 లక్షల రూపాయలు దోచుకెళ్లారని వాపోయాడు. కిడ్నాపర్లు తనను హింసిస్తున్నారని పేర్కొన్నారు. వీడియో వైరల్ కావడంతో వెంటనే అలర్ట్‌ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. అసోం- నాగాలాండ్ సరిహద్దు ప్రాంతమైన ఖంఖతిలోని ఓ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించి కాపాడారు. మరోపక్క వీడియోలో చెప్పింది నిజమేనా? అన్న దానిపై దర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories