Top
logo

కైలాసానికి వీసా ఎలా పొందాలి : అశ్విన్‌

కైలాసానికి  వీసా ఎలా పొందాలి : అశ్విన్‌
X
Ashwin Ravichandran, Nithyananda
Highlights

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న వివాదస్పద స్వామీజి నిత్యానంద ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి...

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న వివాదస్పద స్వామీజి నిత్యానంద ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి కైలాస అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ దేశానికి ద్వీపానికి ఒక పాస్ పోర్టు రూపొందించారు. దీనిపై సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా దీనిపై భారత జట్టు క్రికెటర్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందించారు. తన వ్యక్తిగత ట్విటర్ ఖాతాలో ఓ ట్విట్ చేశారు. నిత్యానంద దేశం కైలాసానికి వెళ్లేందుకు వీసా ఎలా తీసుకోవాలి? వీసా ఇక్కడే ఇస్తారా ? లేదంటే అక్కడికి వెళ్లాక తీసుకోవాలా? అంటూ అశ్విన్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ అశ్విన్‌ చేసిన ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కైలాస చూడటానికి వెళతావా? అక్కడే నివాసముంటావా? అంటూ నెటిజన్లే వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.

నిత్యానిందపై అత్యాచార కేసు నమోదు అయిన తర్వాత కనిపించకుండా పోయారు. పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. దీంతో ఆయన నేపాల్ మీదుగా నకిలీ పాస్ పోర్ట్‌తో పరైరయ్యారు. అయితే ఏ దేశం వెళ్లి ఉంటారో అన్నదానిపై విపరీతంగా చర్చ కొనసాగింది. ఈ క్రమంలో నిత్యానంద గురించి ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వెస్టీండిస్ దీవుల్లో ఈ విలక్ష స్వామి ప్రత్యక్షం అయ్యారు. ఈక్వెడార్ సమీంలోని ఓ చిన్న దీపంలో తీష్ట వేసి హిందూ దేశంగా నిత్యానంద ప్రకటించుకున్నారు.

బెంగళూరులో 2000 సంవత్సరంలో ఓ ఆశ్రమాన్ని స్థాపించి తన ప్రవచనాలతో ప్రజలను ఆకర్షించిన నిత్యానంద అసలు పేరు రాజశేఖరన్. 2010లో ఓ నటితో సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు రావడంతో నిత్యానందుడి అసలు లీలలు బయటపడ్డాయి. ఆశ్రమం మాటున అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్నారంటూ నిత్యానందపై కేసు నమోదయ్యింది. అప్పట్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్ గడువు పూర్తైనప్పటికీ పోలీసులకు లొంగిపోలేదు. నిత్యానంద కోసం పోలీసులు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. 2018లోనే దేశం విడిచి వెళ్లి పోయారు. నకిలీ పాస్‌పోర్ట్‌తో, నేపాల్‌ మీదుగా నిత్యానంద పారిపోయారు.

నిత్యానంద ప్రభుత్వంలో పది శాఖలకూడా ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు, రక్షణ, సోషల్ మీడియా, హోం, కామర్స్, విద్యతో పాటు ఇతర శాఖలు ఉన్నాయి. తమ దేశంలో ఉచితంగా భోజనం, విద్య, వైద్యం లభిస్తాయని ఆధ్యాత్మిక విద్య, ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై దృష్టి పెడుతున్నామంటూ ఆ వెబ్ సైట్లో వెల్లడించారు. కైలాస రాజకీయేతర హిందూ దేశమని హిందుత్వ పునరుద్దరణ కోసం కృషి చేస్తుందంటున్నారు. ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కైలాసకు దేశంగా గుర్తింపు ఇవ్వాలంటూ ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేశారు. నిత్యానంద కొత్త దేశంపై నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు.Web TitleAshwin had the most desi response to fugitive nithyananda founding kailaasa nation
Next Story